Home > జాతీయం > బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు బీజేపీ టీడీపీ పొత్తు..! వర్కౌట్ అయ్యేనా..?

బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు బీజేపీ టీడీపీ పొత్తు..! వర్కౌట్ అయ్యేనా..?

బీఆర్ఎస్ను ఎదుర్కొనేందుకు బీజేపీ టీడీపీ పొత్తు..! వర్కౌట్ అయ్యేనా..?
X

కర్నాటక ఎన్నికల అనంతరం దేశ రాజకీయాల్లో పలు మార్పులు వచ్చాయి. నిన్న మొన్నటి వరకు టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడుతో ఫోన్ లో మాట్లాడేందుకు సైతం ఇష్టపడని బీజేపీ ఇప్పుడు ఏకంగా ఆయనతో భేటీ కావడం హాట్ టాపిక్ గా మారింది. కేంద్రమంత్రి అమిత్ షా, బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డాతో చంద్రబాబు సమావేశంం కావడం అందరినీ ఆశ్చర్యపరిచింది. ఈ భేటీలో వచ్చే అసెంబ్లీ ఎన్నికల్లో తెలంగాణతో పాటు ఏపీలో కలిసి పనిచేయడంపై నేతలు చర్చించినట్లు తెలుస్తోంది.

తెలంగాణలో పొత్తు..?

శనివారం చంద్రబాబు కేంద్ర మంత్రి అమిత్ షా మధ్య జరిగిన భేటీ దాదాపు 30 నిమిషాల పాటు సాగింది. అనంతరం జేపీ నడ్డాతో సమావేశమయ్యారు. బీజేపీ కీలక నేతలతో టీడీపీ అధినేత పొత్తుల అంశంపై చర్చించినట్లు తెలుస్తోంది. 2018లో ఎన్డీఏ నుంచి బయటకు వచ్చిన టీడీపీ 2024 ఏపీ అసెంబ్లీ ఎన్నికల్లో తిరిగి ఆ కూటమిలో చేరేందుకు ఉవ్విళ్లూరుపోతోంది. ఏపీలో బీజేపీతో కలిసి పనిచేస్తే వైసీపీకి చెకd పెట్టి మళ్లీ అధికారం చేపట్టవచ్చని బాబు భావిస్తున్నట్లు సమాచారం. ఇటు తెలంగాణలోనూ బీజేపీతో పొత్తు ద్వారా ప్రభుత్వ వ్యతిరేకతను క్యాష్ చేసుకోవచ్చన్నది చంద్రబాబు ప్లాన్ గా తెలుస్తోంది. మరోవైపు కర్నాటకలో ఎదురైన పరాభవంతో డీలా పడ్డ బీజేపీ సైతం అందుకు పొత్తుకు సిద్ధంగా ఉందన్న ఊహాగానాలు వినిపిస్తున్నాయి. వాదనలు వినిపిస్తున్నాయి.

పొత్తుకు బీజేపీ రెడీ..!

ప్రస్తుతం తెలంగాణలో బీజేపీ పరిస్థితి అగమ్య గోచరంగా మారింది. కర్నాటక ఫలితాల తర్వాత బీజేపీ క్యాడర్ లో తీవ్ర నిరాశ నెలకొంది. మరోవైపు ఊహించని రీతిలో కాంగ్రెస్ పుంజుకుంటోంది. ఈ పరిస్థితుల్లో బీజేపీ అసెంబ్లీ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేసినా ఫలితం ఉండదని పార్టీ హైకమాండ్ భావిస్తోంది. ప్రస్తుత పరిస్థితుల్లో బీఆర్ఎస్ తో కలిసే అవకాశం లేదు. కాంగ్రెస్ తో జతకట్టే ఛాన్స్ అంతకన్నా లేదు. సిద్ధాంతాలపరంగా బీఎస్పీతో విబేధాలున్నాయి. ఈ పరిస్థితుల్లో బీజేపీకి ఉన్న ఒకే ఒక్క ఆప్షన్ తెలుగుదేశం అని రాజకీయ నిపుణులు అంటున్నారు. టీడీపీతో పొత్తు పెట్టుకుంటే ఆంధ్రా ఓటర్ల ఓట్లు కలిసిసొస్తాయని బీజేపీ భావిస్తున్నట్లు సమాచారం.

ప్రతికూలంగా మారే ఛాన్స్

మరోవైపు టీడీపీతో పొత్తు బీజేపీకి ప్లస్ కన్నా ఎక్కువ మైనస్‌గా అయ్యే అవకాశంలేకపోలేదని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. తెలంగాణను వ్యతిరేకించిన టీడీపీతో పొత్తు పెట్టుకుంటే బీఆర్ఎస్, కాంగ్రెస్లకు స్వయంగా ఓ అస్త్రం అందించినట్లవుతుంది. ఆంధ్రా సెటిలర్ల ఓట్లలో చీలిక వచ్చి బీఆర్ఎస్‌కు లబ్ధి చేకూరే అవకాశమూ లేకపోలేదు. బీజేపీ-టీడీపీ కలిస్తే కాంగ్రెస్‌కు పడే ఓట్లలో చీలికవచ్చి బీఆర్ఎస్‌కు లాభం కలుగుతుంది. ఎటుపోయి ఈ పొత్తు కేసీఆర్‌కు కలిసొచ్చే అవకాశం లేకపోలేదు.

ఆ వార్తలు అబద్దం

బీజేపీ, టీడీపీ మధ్య పొత్తు కుదిరిందంటూ వార్తలు హల్‌చల్ చేయడంతో బీజేపీ తెలంగాణ అధ్యక్షుడు బండి సంజయ్ స్పందించారు. అవన్నీ ఊహాగానాలేనని, పొత్తు వార్తల్లో నిజం లేదని తేల్చి చెప్పారు. టెలికాన్ఫరెన్స్ ద్వారా పార్టీ నేతలతో మాట్లాడిన ఆయన ఈ పొత్తు వార్తలపై స్పష్టతనిచ్చారు. తెలంగాణలో బీజేపీకి ఆదరణ పెరుగుతుండడంతో దానిని దెబ్బతీసేందుకు బీఆర్ఎస్, కాంగ్రెస్‌తోపాటు మరికొన్ని శక్తులు ప్రయత్నిస్తున్నాయని ఆరోపించారు. అమిత్ షా, నడ్డాలను చంద్రబాబు కలిస్తే తప్పేంటని ప్రశ్నించారు. గతంలో వివిధ రాష్ట్రాల సీఎంలు, ప్రతిపక్ష నాయకులు మోడీ, అమిత్ షాలను కలిసిన విషయాన్ని గుర్తు చేశారు.

2018లో గుడ్ బై..

నిజానికి టీడీపీ 2014లోనే ఎన్డీఏలో భాగస్వామిగా చేరింది. అయితే 2019 అసెంబ్లీ ఎన్నికలకు ఏడాది ముందు 2018లో ప్రత్యేక హోదా సాకుతో బీజేపీకి గుడ్ బై చెప్పింది. అనంతరం అవకాశం దొరికినప్పుడల్లా బీజేపీ విధానాలపై విరుచుకుపడ్డారు. ఒక దశలో మోడీ ఖబడ్దార్ అంటూ హెచ్చరించిన సందర్భాలు ఉన్నాయి. వైఎస్ జగన్ ప్రభుత్వానికి మోడీ సర్కారు అండదండలపైనా శోకాలు పెట్టారు. తాజాగా మారిన పరిస్థితులు బీజేపీతో దోస్తానా కోసం ప్రయత్నిస్తున్న చంద్రబాబుకు కలిసొచ్చింది. కర్నాటక ఎన్నికల ఫలితాలు అనంతరం అటు బీజేపీ వైఖరిలోనూ మార్పు వచ్చింది. ఇటీవలే పోర్ట్ బ్లెయిర్ మున్సిపల్ ఎన్నికల్లో టీడీపీ బీజేపీలు కలిసి పోటీ చేశాయి. మరోవైపు ప్రధాని మోడీ సైతం టీడీపీ వ్యవస్థాపకుడైన ఎన్టీఆర్ గురించి మన్ కీ బాత్ ప్రోగ్రాంలో ప్రస్తావించారు. కొత్త పార్లమెంటు భవనం ప్రారంభోత్సవానికి ఆహ్వానం పంపిన మూడు అపొజిషన్ పార్టీల్లో టీడీపీ కూడా ఒకటి కావడం విశేషం.

Updated : 7 Jun 2023 11:58 AM IST
Tags:    
Next Story
Share it
Top