ఆర్డర్ చేసిన నాలుగేళ్లకు డెలివరీ..!
X
ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా ఆన్ లైన్ యుగం నడుస్తోంది. మనకు ఏం కావాలన్నా ఆన్ లైన్ ఆర్డర్స్ ద్వారా పొందుతున్నాం. మనం ఆర్డర్ పెట్టిన ఐటెమ్ డిమాండ్, దూరం బట్టి డెలవరీ చేస్తుంటారు. ప్రధాన నగరాల్లో 2-3 రోజులకి వస్తే..పట్టణాలు, గ్రామాల్లో 7-10 రోజులో వస్తుంది. కాస్త లేటైతే నెల రోజులలోపు డెలివరీ చేస్తారు. కానీ ఓ వ్యక్తికి ఆర్డర్ చేసిన 4 సంవత్సరాల తర్వాత అందింది. మీరు విన్నది నిజమే. 2019లో ఆర్డర్ చేస్తే 2023లో వచ్చింది.
ఢిల్లీకి చెందిన సాఫ్ట్‌వేర్ ఇంజినీర్ నితిన్ అగర్వాల్ చెైనా ఇ-కామర్స్ వేదిక ఆలీ ఎక్స్‌ప్రెస్ నుంచి కొవిడ్ కంటే ముందే వస్తువును ఆర్డర్ చేశారు. అది ఇప్పుడు డెలివరీ అయిందని ట్విట్టర్ ద్వారా తెలిపాడు. ‘ఎవరూ ఆశలు కోల్పోవద్దు.. ఎప్పుడో ఒకప్పుడు మీ వస్తువులూ డెలివరీ అవుతాయి’ అంటూ రాసుకొచ్చాడు.ప్రస్తుతం ఈ ట్వీట్ వైరల్‌గా మారింది. భద్రతా కారణాల దృష్ట్యా ఆలీ ఎక్స్‌ప్రెస్‌ను కరోనా తర్వాత భారత ప్రభుత్వం బ్యాన్ చేసింది. దీన్ని నిషేధించకముందే ఈ వస్తువును కొనుగోలు చేసినట్లు అగర్వాల్ తెలిపారు.
ఈ పోస్ట్ నెట్టింట వైరల్ కావడంతో పలువురు నెటిజన్లు స్పందించారు. తాము కూడా 3-4 సంవత్సరాలు కిందట ఆర్డర్ చేసిన వస్తువుల కోసం ఆశగా ఎదురుచూస్తున్నామని కామెంట్స్ చేస్తున్నారు. మీ పోస్ట్ చూశాక ఎప్పటికైనా వస్తాయన్న నమ్మకం కుదిరింది అని ఓ యూజర్ రాసుకొచ్చాడు.
Never lose hope! So, I ordered this from Ali Express (now banned in India) back in 2019 and the parcel was delivered today. pic.twitter.com/xRa5JADonK
— Tech Bharat (Nitin Agarwal) (@techbharatco) June 21, 2023