తెలంగాణ, కేరళ హైకోర్టు సీజేలకు ప్రమోషన్.. కొలీజియం సిఫార్సు!
Mic Tv Desk | 5 July 2023 9:27 PM IST
X
X
తెలంగాణ చీఫ్ జస్టిస్ ఉజ్జల్ భుయాన్, కేరళ సీజే వెంకటనారాయణ భట్టిలకు ప్రమోషన్ లభించనుంది. వీరిద్దరినీ సుప్రీంకోర్టు జడ్జీలుగా కొలీజియం సిఫార్సు చేసింది. సుప్రీం కొలీజియం సిఫార్సులను కేంద్ర న్యాయశాఖ యధాతథంగా ఆమోదించే అవకాశం ఉంది. ఈ క్రమంలో ఇద్దరు ప్రధాన న్యాయమూర్తుల ప్రమెషన్ లాంఛనమే కానుంది.
ఉజ్జల్ భుయాన్ 2011 అక్టోబర్ 17న గౌహతి హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు. ఆ తర్వాత బాంబే హైకోర్టుకు బదిలీ అయ్యారు. ఇక 2022 జూన్ 28న తెలంగాణ హైకోర్టు సీజేగా బాధ్యతలు చేపట్టారు. జస్టిస్ ఉజ్జల్ భుయాన్కు న్యాయపరమైన పలు అంశాల్లో మంచి పట్టుంది. ఇక జస్టిస్ వెంకటనారాయణ భట్టి 2013 ఏప్రిల్ 12న ఏపీ హైకోర్టు న్యాయమూర్తిగా నియమితులయ్యారు.
ఆ తర్వాత ఆయన కేరళ హైకోర్టుకు బదిలీ అయ్యారు. గత నెల 1వ తేదీన కేరళ హైకోర్టు చీఫ్ జస్టిస్గా ప్రమోషన్ పొందారు. కాగా ప్రస్తుతం సుప్రీంకోర్టులో 31 మంది న్యాయమూర్తులు ఉన్నారు. జస్టిస్ కృష్ణ మురారి ఈ నెల 7 పదవీ విరమణ చేయనుండగా.. ఖాళీల సంఖ్య నాలుగుకు చేరనుంది. జస్టిస్ ఉజ్జల్ భుయాన్, జస్టిస్ వెంకటనారాయణ రెడ్డిలకు పదోన్నతిలతో ఆ సంఖ్య 2కు తగ్గనుంది.
Updated : 5 July 2023 9:27 PM IST
Tags: Supreme court SC collegium Justice Ujjal Bhuyan Venkatanarayana Bhatti telangana high court kerala high court
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire