Home > జాతీయం > New Year Celebrations : మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్‌.. అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్ ఓపెన్‌

New Year Celebrations : మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్‌.. అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్ ఓపెన్‌

New Year Celebrations : మందుబాబులకు కిక్కిచ్చే న్యూస్‌.. అర్థ‌రాత్రి వ‌ర‌కు వైన్స్ ఓపెన్‌
X

మరికొన్ని గంటల్లో కొత్త సంవత్సరం రాబోతుంది. న్యూ ఇయర్‌కి గ్రాండ్ వెల్‌కమ్ చెప్పేందుకు యువత సిద్ధమవుతోంది. ఇప్పటికే వేడుకులకు హోటల్స్‌, పబ్బులు, బార్లు సిద్ధమయ్యాయి. ఇక డిసెంబర్‌ 31 అంటేనే మందు బాబులకు పండగా. మందేస్తూ, చిందేస్తూ గ్రాండ్‌గా సెలబ్రేట్‌ చేసుకుంటుంటారు. ఈ నేపథ్యంలో మందు బాబులకు ప్రభుత్వం బంప‌ర్ ఆఫ‌ర్ ఇచ్చింది. రెండురోజుల పాటు మ‌ద్యం దుకాణాల‌ను 12గంట‌ల వ‌ర‌కు తెరిచి ఉంచ‌నున్న‌ట్లు అధికారిక ప్ర‌క‌టన చేసింది. ఇటు తెలంగాణ‌, అటూ ఆంధ్ర‌ప్ర‌దేశ్ ప్ర‌భుత్వం అర్ధరాత్రి 12 గంటల వరకు మద్యం దుకాణాలు ఓపెన్ చేసుకోవచ్చని తెలిపింది.

డిసెంబర్ 31, జనవరి 1 తేదీల్లో రెండు రోజుల పాటు రాష్ట్రంలోని అన్ని మద్యం దుకాణాలు అర్ధరాత్రి 12 వరకు తెరిచే ఉంటాయని అధికారులు చెప్పారు. ఇక బార్లు, క్లబ్బులు, పర్మిషన్‌తో జరిగే ఈవెంట్లలో అర్ధరాత్రి 1 గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం పర్మిషన్ ఇచ్చింది. ఈ మేరకు ఎక్సైజ్ అధికారులు ఉత్తర్వులు జారీ చేస్తారు. సాధారణంగా డిసెంబర్ 31న పెద్ద ఎత్తున లిక్కర్ సేల్స్ జరుగుతాయి. ఈ నేపథ్యంలో ఈ అవకాశాన్ని వినియోగించుకునేందుకు ప్రభుత్వం సమయాన్ని పొడగించింది. ఇదే సమయంలో డ్రంకెన్ డ్రైవ్‌లో దొరికితే పోలుసులు బ్యాండ్ బజాయించనున్నారు. న్యూ ఇయర్ నేపథ్యంలో నగరంలో ప్రత్యేకంగా బృందాలను ఏర్పాటు చేసి డ్రంకెన్ డ్రైవ్ టెస్టులు నిర్వహించేందుకు సిద్ధమయ్యారు. తాగి వాహనాలు నడిపితే కఠిన చర్యలు తీసుకునేందుకు సిద్ధమయ్యారు. నేడు రాత్రి 8 గంటల నుంచే డ్రంకెన్ డ్రైవ్ టెస్టులకు సిద్దం కాగా.. తాగి వాహనాలు నడిపితే బండిని సీజ్ చేయటంతో పాటు రూ. 10 వేల ఫైన్, 6 నెలల జైలు శిక్ష ఉంటుందని పోలీసులు హెచ్చరిస్తున్నారు.

అటు ఏపీ ప్రభుత్వం కూడా ఈ రెండ్రోజులు రాష్ట్రవ్యాప్తంగా వైన్‌ షాపులు అర్థరాత్రి 12 గంటల వరకు తెరిచి ఉంటాయని తెలిపింది. రాష్ట్ర ప్రభుత్వ అనుమతితో నడిచే అన్ని ఈవెంట్స్‌లో ఈ రెండు రోజుల పాటు రాత్రి ఒంటి గంట వరకు మద్యం విక్రయాలకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. అయితే ఇది కేవలం ఈవెంట్స్‌ నిర్వహించే ప్రదేశం లోపల మాత్రమే అనుమతి ఉంటుంది. ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయం పట్ల మందుబాటులు ఫుల్‌ ఖుషీ అవుతున్నారు.




Updated : 31 Dec 2023 12:06 PM IST
Tags:    
Next Story
Share it
Top