Telangana High Court : గవర్నర్ కోటా ఎమ్మెల్సీల వివాదం.. కాసేపట్లో హైకోర్టు తీర్పు
X
నామినేటెడ్ ఎమ్మెల్సీలపై గవర్నర్ నిర్ణయాన్ని సవాల్ చేస్తూ బీఆర్ఎస్ నేతలు దాసోజ్ శ్రవణ్, కుర్ర సత్యనారాయణలు హైకోర్టును ఆశ్రయించారు. తమను ఎమ్మెల్సీలుగా నియమించడంతోపాటు కేసు తేలేవరకు కొత్త నియామకాలపై స్టే ఇవ్వాలని కోర్టును కోరారు. ఆర్టికల్ 171 ప్రకారం కేబినేట్ నిర్ణయాన్ని గవర్నర్ ఆపడానికి వీల్లేదని పిటిషనర్ తరఫు లాయర్లు వాదించారు. అయితే ఆర్టికల్ 361 ప్రకారం పిటిషన్కు అర్హత లేదని గవర్నర్ తరఫు లాయర్ కోర్టుకు స్పష్టం చేశారు. ఈ కేసులో వాదనలు పూర్తికావడంతో మధ్యాహ్నం 2.30కి హైకోర్టు తీర్పు ఇవ్వనుంది.
కాగా బీఆర్ఎస్ నేతలు దాసోజ్ శ్రవణ్, కుర్ర సత్యనారాయణలను ఎమ్మెల్సీలుగా నామినేట్ చేస్తూ గత జులైలో బీఆర్ఎస్ ప్రభుత్వం కేబినేట్ లో తీర్మానం చేసింది. అనంతరం ఆ తీర్మానాన్ని ఆమోదం కోసం గవర్నర్ తమిళి సై వద్దకు పంపారు. అయితే గవర్నర్ ఆ తీర్మానాన్ని తిరస్కరించారు. అయితే గవర్నర్ తన పరిధి దాటి వ్యవహరించారని, ఎమ్మెల్సీలను నామినేట్ చేసే హక్కు మంత్రి మండలికి ఉంటుందంటూ శ్రవణ్, సత్యనారాయాణ హైకోర్టును ఆశ్రయించారు.