Home > జాతీయం > Budget-2024 : బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలు.. మేలు జరిగేనా?

Budget-2024 : బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలు.. మేలు జరిగేనా?

Budget-2024 : బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్న తెలుగు రాష్ట్రాలు.. మేలు జరిగేనా?
X

(Budget-2024) బడ్జెట్‌ను కాసేపట్లో ఆర్థిక మంత్రి నిర్మల సీతారామన్ ప్రవేశపెట్టనున్నారు. ఈసారి డిజిటల్ రూపంలోనే బడ్జెట్‌ను ప్రవేశపెట్టనున్నారు. ఈ ఓటాన్ అకౌంట్ బడ్జెట్‌లో తెలుగు రాష్ట్రాలకు నిధుల కేటాయింపుపై రెండు రాష్ట్రాలు ఆశలు పెట్టుకున్నాయి. కీలక అంశాలకు సంబంధించిన మార్పులు ఈ బడ్జెట్‌లో ఉండటంతో సర్వత్రా ఉత్కంఠ నెలకొంది. ఏపీ, తెలంగాణలోని చిన్న, మధ్య తరహా పరిశ్రమలు ఎక్కువగా ఈ బడ్జెట్‌పై ఆశలు పెట్టుకున్నట్లు తెలుస్తోంది.

తెలంగాణలో ప్రాజెక్టులు, నిధుల కేటాయింపులు కొంత వరకూ ఉండొచ్చని రాష్ట్రం అంచనా వేస్తోంది. హైదరాబాద్ నుంచి విజయవాడ వరకూ నూతన పారిశ్రామిక కారిడార్ ఏర్పాటుకు ఆమోదం లభిస్తుందని సమాచారం. రెండు రాష్ట్రాల్లో మెట్రో రైలు ప్రాజెక్టు, తెలంగాణకు కేంద్రం ఇటీవలె ఆమోదం తెలిపిన గిరిజన యూనివర్సిటీకి నిధులు లభిస్తాయని ప్రభుత్వం ఆశిస్తోంది. ఇకపోతే రైతులు కూడా ఈ బడ్జెట్‌లో తమకు అనుకూల ప్రకటనలు వస్తాయని చూస్తున్నారు.

మధ్యంతర బడ్జెట్‌లో రైతులను ప్రధానంగా ఆకట్టుకునేందుకు ప్రధాని మోదీ సర్కార్ చూస్తోంది. పీఎం కిసాన్ పథకం కింద రైతులకు ఇస్తున్న పెట్టుబడి సాయాన్ని రూ.6 వేల నుంచి రూ.9 వేలకు పెంచనున్నట్లు తెలుస్తోంది. ఆయుష్మాన్ భారత్ కింద బీమా కవరేజీని రూ.5 లక్షల నుంచి రూ.10 లక్షలకు పెంచే అవకాశాలు ఉన్నాయి. అలాగే చిన్నతరహా వ్యాపారులు కూడా రుణాలపై ఊరట లభించవచ్చని భావిస్తున్నారు.


Updated : 1 Feb 2024 11:10 AM IST
Tags:    
Next Story
Share it
Top