కెనడాలో తెలుగు విద్యార్థి మృతి
Mic Tv Desk | 4 July 2023 7:01 PM IST
X
X
కెనడాలో విషాద ఘటన చోటుచేసుకుంది. వాటర్ ఫాల్స్ చూడడానికి వెళ్లిన ఐదుగురు విద్యార్థులు ప్రమాదవశాత్తు మృతి చెందారు. అందులో ఓ తెలుగు సైతం ఉన్నాడు. మచిలీపట్నానికి లెనిన్ నాగకుమార్ అనే యువకుడు తన ఫ్రెండ్స్తో కలిసి సిల్వర్ ఫాల్స్ వాటర్ ఫాల్స్ వద్దకు వెళ్లారు. అయితే ప్రమాదవశాత్తు ఐదుగురు విద్యార్ధులు మరణించారు. నాగకుమార్ మృతితో వారి తల్లిదండ్రులు బోరున విలపిస్తున్నారు.
మచిలీపట్నం చింతకుంటపాలెంకు చెందిన నాగకుమార్ రెండేళ్ల క్రితం ఎంసీఏ చదివేందుకు కెనడా వెళ్లాడు. ప్రమాదవశాత్తు అతడు మరణించడంతో ఆ గ్రామంలో విషాదఛాయలు అలుముకున్నాయి. నాగకుమార్ మృతదేహాన్ని కెనడా నుంచి మచిలీపట్నంకు ఎలా తీసుకురావాలో తెలియక తల్లిదండ్రులు ఆందోళన చెందుతున్నారు. తమ కుమారుడి చివరి చూపు దక్కేలా చూడాలని అధికారులను కోరుతున్నారు.
Updated : 4 July 2023 7:01 PM IST
Tags: canada telugu student machilipatnam andhra pradesh vijayawada trending news today current trending topics Today Trending News in Telugu news telugu news telugu today breaking news in telugu Mic Tv Telugu news
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire