Home > జాతీయం > బెంగాల్లో ఉద్రిక్తత.. కౌంటింగ్ కేంద్రాలపై బాంబు దాడి

బెంగాల్లో ఉద్రిక్తత.. కౌంటింగ్ కేంద్రాలపై బాంబు దాడి

బెంగాల్లో ఉద్రిక్తత.. కౌంటింగ్ కేంద్రాలపై బాంబు దాడి
X

వెస్ట్ బెంగాల్ లో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. శనివారం (జులై 9) జరిగిన పంచాయితీ ఎన్నికల సమయంలో.. హింసాత్మక ఘర్షనలు చోటుచేసుకున్న విషయం తెలిసిందే. ఆ ఘర్షనల్లో 15 మంది ప్రాణాలు కోల్పోయారు. డైమండ్ హర్బర్ లోని ఓ పోలింగ్ కేంద్రంపై దుండగులు బాంబులు విసిరారు. అయితే ఆ పేలుడు వల్ల ఎవరికీ ఎలాంటి హాని జరుగలేదని అధికారులు తెలిపారు. ఈ కారణాల దృష్ట్యా.. కౌటింగ్ కేంద్రాల వద్ద భద్రతను కట్టుదిట్టం చేశారు. పోలీసులతో పాటు కేంద్ర బలగాలను రంగంలోకి దింపారు. ఈ పరిణామాల మధ్య మంగళవారం (జులై 11) ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. అయినా, కొన్ని కౌటింగ్ కేంద్రాల వద్ద ఉద్రిక్త పరిస్థుతుల తలెత్తుతున్నాయి. కొందరు స్థానికులు కౌంటింగ్ కేంద్రాలను ముట్టడించగా.. పోలీసులపై లాఠీ ఛార్జ్ చేసి వాళ్లను చెదరగొట్టారు. ప్రస్థుతం 144 సెక్షన్ విధించారు.

బెంగాల్ వ్యాప్తంగా దాదాపు 74వేల స్థానాల్లో పోలింగ్ జరిగింది. ఆ ఎలక్షన్స్ లో ఘర్షనలు తలెత్తడంతో కొన్ని చోట్ల పోలీంగ్ నిలిపివేశారు. దాంతో 696 పోలింగ్ కేంద్రాల్లో సోమవారం (జులై 10) రీపోలింగ్ నిర్వహించారు. ఓట్ల లెక్కిపు ముగియడానికి ఇంకా రెండు రోజుల టైం పడుతుంది. ఇప్పటి వరకు వెలువడిన ఫలితాల ప్రకారం 136 పంచాయితీ స్థానాల్లో తృణమూల్ కాంగ్రెస్ పార్టీ ఆధిక్యంలో కొనసాగుతోంది. లోక్ సభ ఎలక్షన్స్ సమీపిస్తున్న వేళ.. బెంగాల్ లో ఈ పంచాయితీ ఎలక్షన్స్ ను ప్రధాన పార్టీలు ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నాయి.




Updated : 11 July 2023 7:08 AM GMT
Tags:    
Next Story
Share it
Top