Home > జాతీయం > Tesla : త్వరలో భారత్‌లో టెస్లా..దిగుమతి సుంకం మినహాయింపు

Tesla : త్వరలో భారత్‌లో టెస్లా..దిగుమతి సుంకం మినహాయింపు

Tesla : త్వరలో భారత్‌లో టెస్లా..దిగుమతి సుంకం మినహాయింపు
X

భారత్ మార్కెట్‌లోకి టెస్లా కార్ల రాక కోసం ఎదరుచూస్తున్న ఎలక్ట్రిక్ కార్ల ప్రియులకి కేంద్రం గుడ్ న్యూస్ చెప్పింది. దిగుమతి సుంకంపై ఇచ్చే రాయితీని పొడిగించే యోచనలో కేంద్రం ఉన్నట్లు తెలుస్తోంది.రూ.30 లక్షల మించి ఎలక్ట్రిక్ కార్లపై పన్ను మినహాయింపు 2-3 సంవత్సరాలు పొడిగించాలని కేంద్రం చర్యలు జరుపుతున్నట్లు సమాచారం. భారత్ లో దిగుమతి సుంకాలు ఎక్కువ అని, సుంకాలు తగ్గించాలని ఎలన్ మస్క్, టెస్లా ప్రతినిధులు కోరినప్పుడు.. దేశీయంగా ప్రొడక్షన్ యూనిట్ ఏర్పాటు చేస్తే పరిశీలిస్తామని కేంద ప్రభుత్వ అధికారులు తేల్చి చెప్పారు.కానీ, గత జూన్‌లో అమెరికా పర్యటనకు వెళ్లినప్పుడు ప్రధాని నరేంద్రమోదీతో టెస్లా సీఈఓ ఎలన్ మస్క్ సమావేశమయ్యారు.

నాటి నుంచి భారత్ మార్కెట్లోకి టెస్లా కార్లను తీసుకొచ్చే పనులు ముమ్మరం అయ్యాయి. ఇందులో భాగంగా భారత్ లో కార్లు, బ్యాటరీల తయారీ యూనిట్లను ఏర్పాటు చేయడానికి కేంద్రంతో టెస్లా ప్రతినిధులు చర్చలు జరుపుతున్నారు. 2024లో కేంద్రం అనుమతులు ఇస్తే.. వీలైనంత త్వరగా భారత్ మార్కెట్లోకి టెస్లా కార్లు రానున్నాయని సమాచారం. ఎస్​ సెడాన్​, మోడల్​ ఎక్స్ ఎస్​యూవీ, మోడల్​ 3, మోడల్ వై ఎస్​యూవీ వాహనాల డ్రైవింగ్ స‌మ‌యంలో సీట్ బెల్ట్ రిమైండ్ చేయ‌డం స‌మ‌స్య తెలత్తిన‌ట్లు తెలుస్తోంది. ఈ స‌మ‌స్య కార‌ణంగా రోడ్డు ప్ర‌మాదాలు జ‌రిగే ప్ర‌మాదం ఎక్కువ ఉంటుంద‌నే కార‌ణంతో సుమారు.8,17,000 కార్ల‌ను రీకాల్ చేయాల‌ని ఎన్ హెచ్ టీఎస్ ఏ అధికారులు టెస్లాను ఆదేశించారు. దీంతో అప్ర‌మ‌త్త‌మైన టెస్లా కార్లకు సంబంధించిన లోపాల్ని స‌త్వ‌ర‌మే ప‌రిష్క‌రించి వాహ‌న‌దారుల‌కు అందుబాటులోకి తెస్తామ‌ని తెలిపింది. కొద్ది రోజుల క్రితం ఇదే టెస్లాకు చెందిన 54వేల‌ కార్లలో సెల్ఫ్ డ్రైవింగ్ సాఫ్ట్‌వేర్‌లో సాంకేతిక స‌మ‌స్య‌లు త‌లెత్తాయి. రెడ్ సిగ్న‌ల్ ప‌డినా టెస్లా కార్లు ర‌య్ మంటూ దూసుకెళ్లాయి. దీంతో టెస్లా కార్లలో భ‌ద్ర‌త ప్ర‌ధాన స‌మ‌స్య‌గా మారింద‌ని, వెంట‌నే ఆ కార్ల‌ను రీకాల్ చేయాల‌ని అమెరికా ర‌క్ష‌ణ నియంత్ర‌ణ సంస్థ టెస్లా సంస్థ‌కు నోటీసులు జారీ చేసింది.

Updated : 19 Feb 2024 5:27 PM IST
Tags:    
Next Story
Share it
Top