Home > జాతీయం > అద్భుతం అయోధ్య ఎయిర్ పోర్టు నిర్మాణం

అద్భుతం అయోధ్య ఎయిర్ పోర్టు నిర్మాణం

అద్భుతం అయోధ్య ఎయిర్ పోర్టు నిర్మాణం
X

అయోధ్య విమానాశ్రయంలో చేప్టటిన అభివృద్ధి పనులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విజనరీకి అనుగుణంగా ఉంటాయని కేంద్ర పౌరవిమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలిపారు. అయోధ్యకు విమానాల అనుసంధానం పెంపుతో పాటు పర్యాటకాన్ని ప్రోత్సహించాలనే తమ నిబద్ధతకు అయోధ్య విమానాశ్రయం ప్రతీకగా నిలుస్తుందన్నారు. మోదీ నాయకత్వంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం వల్ల అయోధ్య ప్రాంత అభివృద్ధితో పాటు శ్రీరాముని మహోన్నత సంస్కృతికి మరింత గుర్తింపు వస్తుందని చెప్పారు. 'మర్యాద పురుషోత్తమ్ శ్రీరామ్ ఎయిర్‌పోర్ట్''తో అయోధ్య సర్వతోముఖాభివృద్ధి సాధిస్తుందన్న నమ్మకం తనకు ఉందని మంత్రి అన్నారు. అయోధ్య రామమందిరం నిర్మాణం ముగింపు దశకు వచ్చింది. 2024 జనవరిలో రామమందిరాన్ని పున:ప్రారంభించేందుకు నిర్వాహకులు అన్ని ఏర్పాట్లు చేస్తున్నారు. ఓ వైపు రామ మందిరం ప్రారంభం గురించి దేశవ్యాప్తంగా ఆసక్తి నెలకొన్న నేపథ్యంలో అక్కడ కొత్తగా నిర్మిస్తున్న ఎయిర్ పోర్టు గురించి కూడా దేశ ప్రజలు చర్చించుకుంటున్నారు.

'మర్యాద పురుషోత్తం శ్రీరామ్ అంతర్జాతీయ విమానాశ్రయం' అని యూపీ ప్రభుత్వం ఈ ఎయిర్ పోర్టుకు ఇప్పటికే నామకరణం చేయగా.. తాజాగా అయోధ్యలో నిర్మిస్తున్న ఈ కొత్త ఎయిర్ పోర్టు నిర్మాణ వివరాలను కేంద్ర విమానయాన శాఖ మంత్రి జ్యోతిరాదిత్య సింధియా తెలియజేశారు. హిందూ సంస్కృతిని ప్రతిబింబించేలా ఈ ఎయిర్ పోర్టు నిర్మాణం ఉంటుందని అన్నారు. విమానాశ్రయం డిజైన్ నాగరా శైలి నిర్మాణాలను పోలి ఉంటుందని, అయోధ్య నగర గొప్ప వారసత్వాన్ని ప్రతిబింబించేలా ఈ నిర్మాణం ఉంటుందని అన్నారు. మొత్తం రూ.250 కోట్లతో ఎయిర్ పోర్టును అభివృద్ధి చేస్తున్నట్లు తెలిపారు. కొత్తగా నిర్మించే రెండు అంతస్తుల టెర్మినల్ లో 750 మంది ప్రయాణికులకు సరిపోయేలా అత్యాధునిక వసతులతో నిర్మిస్తున్నట్లు చెప్పారు. విమానాశ్రయం యొక్క ప్రధానద్వారం అత్యద్భుతంగా చెక్కిన శిఖరం ఉంటుందని అన్నారు. టెర్మినల్ కు సపోర్టుగా పెట్టిన స్తంభాలు రామాయంలోని ప్రధాన ఘట్టాలను సూచించేలా ఉంటాయని అన్నారు. ఇక గంటకు నాలుగు విమానాలు ఈ అంతర్జాతీయ విమానాశ్రయం నుంచి రాకపోకలు సాగిస్తాయని తెలిపారు.


Updated : 11 Dec 2023 7:45 PM IST
Tags:    
Next Story
Share it
Top