Home > జాతీయం > Odisha state : అంబులెన్స్ లేక..భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

Odisha state : అంబులెన్స్ లేక..భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త

Odisha state  : అంబులెన్స్ లేక..భార్య మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన భర్త
X

ఒడిశా రాష్ట్రం కోరాపుట్ జిల్లా పురుణగూడలో హృదయ విదారక ఘటన జరిగింది. అంబులెన్స్‌ అందుబాటులో లేకపోవడంతో భార్య మృతదేహాన్ని కుటుంబసభ్యుల సహాయంతో ఆమె భర్త 20 కిలోమీటర్లు మోసుకెళ్లిన దయనీయ ఘటన వెలుగులోకి వచ్చింది. దీనిపై మృతురాలి భర్త అభి అమానత్య మాట్లాడుతూ.. ‘‘మూడు నెలల క్రితం నా భార్య కరుణ ఆడపిల్లకు జన్మనిచ్చింది. అప్పటినుంచి కొరాపుట్‌ జిల్లా బొరిగుమ్మ సమితి కుములి పంచాయతీ పురుణగూడలోని తన పుట్టింట్లో ఉంటోంది. కరుణ అనారోగ్యంతో మృతిచెందింది. అంత్యక్రియలు నా ఇంటివద్ద నిర్వహించేందుకు మృతదేహాన్ని నవరంగపూర్‌ జిల్లా నందహండి సమితి జగన్నాథ్‌పూర్‌ పంచాయతీ ఫుపుగావ్‌కు తీసుకెళ్లాలని నిర్ణయించుకున్నా. మృతదేహాన్ని తరలించేందుకు అంబులెన్స్‌, మహాప్రాణ వాహనాలకు పలుమార్లు ఫోన్‌ చేసినా వారు స్పందించలేదు. వేరే వాహనంలో తీసుకెళ్లేందుకు డబ్బులు లేకపోవడంతో శనివారం ఉదయం కరుణ మృతదేహాన్ని 20 కిలోమీటర్లు మోసుకెళ్లా’’ అని ఆవేదన వ్యక్తం చేశాడు సర్కార్ అంబులెన్స్ లభించకపోవడంతో ప్రైవేటు అంబులెన్స్‌లో తరలించేందుకు డబ్బులు లేకపోవడం.. తప్పని పరిస్థితుల్లో శవాన్ని ఒక మంచాన్ని డోలిగా కట్టి తీసుకువెళ్లారు. కుటుంబీకుల సహాయంతో మృతదేహాన్ని మంచంపై వేసి భుజాలపై మోసుకెళ్లారు. ఇప్పుడు ఈ వీడియో వైరల్‌గా మారింది. దీంతో ఈ ఘటన జిల్లాలో చర్చనీయాంశమైంది.




Updated : 28 Jan 2024 11:36 AM IST
Tags:    
Next Story
Share it
Top