Home > జాతీయం > PAN Card : పాన్‌కార్డు ఉన్నవారికి అలర్ట్‌..అలా చేస్తే భారీ జరిమానా

PAN Card : పాన్‌కార్డు ఉన్నవారికి అలర్ట్‌..అలా చేస్తే భారీ జరిమానా

PAN Card : పాన్‌కార్డు ఉన్నవారికి అలర్ట్‌..అలా చేస్తే భారీ జరిమానా
X

భారతదేశం ఇచ్చే గుర్తింపు కార్డుల్లో పాన్ కార్డు కూడా ఒకటి. ఆదాయపు పన్ను శాఖ పాన్ కార్డును జారీ చేస్తుంది. ఆర్థిక లావాదేవీలకు ఈ పాన్ కార్డు నంబర్ ఎంతో ముఖ్యం. బ్యాంకు ఖాతా తెరవడానికి కూడా ఈ పాన్ నంబర్ ఎంతగానో అవసరం. అయితే పాన్ కార్డు ఉన్నవారు కొన్ని నిబంధనలు పాటించాల్సి ఉంటుంది. పాన్ కార్డుకు సంబంధించి అన్ని నిబంధనలు పాటించకపోతే భారీ జరిమానా విధిస్తారు. చట్టపరమైన చర్యలు కూడా ఎదుర్కోక తప్పదు.





దేశంలోని ప్రతి వ్యక్తీ తన పేరుపై పాన్ నంబర్‌ను తీసుకోవచ్చు. అయితే ఒక వ్యక్తి పేరుపై రెండు పాన్ నంబర్లు ఉంటే అది నేరంగా పరిగణించబడుతుంది. వారు శిక్షను ఎదుర్కోవాల్సి వస్తుంది. డూప్లికేట్ పాన్ కార్డును ఉపయోగించడం కూడా నేరమే అవుతుంది. ఒక వ్యక్తికి ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులు ఉన్నట్లైతే ఆదాయపు పన్ను శాఖ కఠిన చర్యలు తీసుకుంటుంది.





ఒక వ్యక్తి పేరుపై ఒక పాన్ నంబర్ మాత్రమే ఉండాలి. అయితే కొందరు మాత్రం ఒకటి కంటే ఎక్కువ పాన్ కార్డులను పొందుతున్నారు. వారు వెంటనే అలర్ట్ అవ్వకపోతే ఇబ్బందులు తప్పవు. ఆదాయపు పన్ను శాఖ వారికి జరిమానా విధిస్తుంది. నకిలీ పాన్ కార్డులను వినియోగిస్తే రూ.10 వేలకు పైగా జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. ఆ విషయంలో ఏదైనా మోసం జరిగితే జైలు శిక్ష కూడా పడుతుంది. అందుకే ఆదాయపు పన్ను శాఖ నిబంధనలు పాటించి పాన్ కార్డును వినియోగించడం మంచిదని నిపుణులు సూచిస్తున్నారు.


Updated : 18 Feb 2024 5:44 AM GMT
Tags:    
Next Story
Share it
Top