Home > జాతీయం > జులై 1 నుంచి కొత్త చట్టాలు అమలు

జులై 1 నుంచి కొత్త చట్టాలు అమలు

జులై 1 నుంచి కొత్త చట్టాలు అమలు
X

బ్రిటీష్ వలస పాలనలోని ఆనాటి క్రిమినల్ చట్టాలు ఇకపై ఉండవు. ఆ చట్టాల స్థానంలో కొత్త క్రిమినల్ చట్టాలను భారత కేంద్ర ప్రభుత్వం తీసుకురానుంది. ఆ కొత్త చట్టాలు జులై 1వ తేది నుంచి అమల్లోకి వస్తాయని కేంద్రం వెల్లడించింది. భారతీయ న్యాయ సంహింత, భారతీయ నాగరిక్ సురక్ష, భారతీయ సాక్ష్య వంటి కొత్త చట్టాలను తీసుకొస్తున్నట్లు కేంద్రం తెలిపింది.

ఇండియన్ పీనల్ కోడ్-1860, కోడ్ ఆఫ్ క్రిమినల్ ప్రొసీజర్ (సీఆర్పీసీ)-1973, ఇండియన్ ఎవిడెన్స్ యాక్ట్-1872 చట్టాల స్థానంలో ఈ కొత్త చట్టాలు అమల్లోకి రానున్నట్లు కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. ఈ మూడు చట్టాలకు పార్లమెంటు ఆమోదం లభించడంతో పూర్తిస్థాయిలో అమల్లోకి రానున్నాయి. గత డిసెంబరులో రాష్ట్రపతి ద్రౌపది ముర్ము కూడా రాజముద్ర వేయడంతో తాజాగా కొత్త క్రిమినల్ చట్టాల అమలు తేదీపై గెజిట్ విడుదల చేశారు.


Updated : 24 Feb 2024 9:16 PM IST
Tags:    
author-thhumb

Kiran

కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.


Next Story
Share it
Top