Splendor Plus : బజాజ్, టీవీఎస్ కంపెనీలకు షాక్.. సూపర్ మైలేజ్తో సరికొత్త స్ప్లెండర్
X
మిడిల్ క్లాస్ బడ్జెట్ వారికి ఫస్ట్ గుర్తొచ్చే బైక్ కంపెనీ ఏదైనా ఉందంటే అది హీరోనే. చాలాకాలంగా బడ్జెట్ సెగ్మెంట్ లో బైక్స్ ను తీసుకొస్తుంది. తక్కువ ప్రైజ్ లో.. మంచి ఫీచర్స్, మైలేజ్ లను హీరో అందిస్తుంది. ముఖ్యంగా స్ప్లెండర్ బైక్ కు సెపరేట్ ఫ్యాన్ బేస్ ఉంటుంది. తాజాగా అత్యంత అధునాతన ఫీచర్స్ తో హీరో స్ప్లెండర్ బైక్స్ ను తీసుకొచ్చింది. ఈ బైక్ ను కొనేందుకు ఇండియన్ మార్కెట్ లో చాలామంది ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. 97cc ఇంజిన్తో 8.05Nm టార్క్ , 8.02PS పవర్ను ఉత్పత్తి చేస్తుంది. ఇది 80.6kmpl మైలేజీ ఇస్తుంది. ఈ బైక్ కు ముందు, వెనక డ్రమ్ బ్రేకులు, 9.8 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్ సామర్థ్యం ఉన్నాయి. దీని బరువు 112 కిలోలు. నాలుగు స్పీడ్ గేర్ బాక్సులు, ట్యూబ్ లెస్ టైర్లతో వస్తుంది.
3 వేరియంట్లు, 6 ఆకర్షనీయమైన రంగుల్లో వస్తున్న ఈ బైక్.. స్టాండర్డ్ స్ప్లెండర్ ప్లస్, i3S టెక్నాలజీ, Xtec టెక్నాలజీ కూడిన వేరియంట్లతో వస్తుంది. అంతేకాకుండా బ్లూటూత్ కనెక్టివిటీతో పూర్తి ఎల్సీడీ ఇన్ స్ట్రుమెంటేషన్, రియల్ టైం మైలేజ్ ఇండికేటర్ కలిగి ఉంటుంది. ఈ బైక్ ధర, స్పెసిఫికేషన్స్, మైలేజీ పరంగా చూస్తే.. బజాజ్ ప్లాటినా 100, హోండా షైన్ లకు గట్టిపోటీ ఇస్తుంది. కాగా బైక్ ధర ఎక్స్ షో రూం రూ. 75,191 నుంచి 77, 826, రూ. 90,190 (ఆన్ రోడ్) కలిగి ఉంది.