Home > జాతీయం > శోభనం గదిలో నవదంపతులు మృతి..కారణమిదే..

శోభనం గదిలో నవదంపతులు మృతి..కారణమిదే..

శోభనం గదిలో నవదంపతులు మృతి..కారణమిదే..
X

పారాణి ఆరలేదు.. తోరణాలు వాడలేదు..వచ్చిన బంధువులు ఇంటికి చేరనే లేదు..ఇంతలోనే ఓ పెళ్లింట తీవ్ర విషాదం చోటుచేసుకుంది. కోటి ఆశలతో పెళ్లి చేసుకున్న కొత్త జంటకు శోభనం రోజునే నూరేళ్లు నిండిపోయాయి. ఉత్తరప్రదేశ్‌లోని బహ్రైచ్‌ జిల్లాలో మే31న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

వరుడు ప్రతాప్‌ యాదవ్‌కు, వధువు పుష్పలు మే 30 తేదిన ఘనంగా వివాహ చేసుకున్నారు. బంధుమిత్రుల సమక్షంలో వీరి పెళ్లి వైభవంగా జరిగింది. సాంప్రదాయం ప్రకారం పెళ్లి తర్వాత రోజు ఈ కొత్త జంట బుధవారం సాయంత్రం వరుడి ఇంటికి చేరుకున్నారు. ఆ రోజు రాత్రి శోభనానికి ముహుర్తం కావడంతో ఒకే గదిలో కలిసి నిద్రించారు. గురువారం ఉదయం ఎప్పటికీ గది నుంచి బయటకు రాకపోవడంతో కుటుంబ సభ్యులు అనుమానం వచ్చింది. తలుపులు బద్ధలు కొట్టి గదిలోకి వెళ్లి చూడగా.. వారిద్దరు మంచంపై విగతజీవులుగా పడి ఉన్నారు.

సమాచారం అందుకున్న పోలీసులు మృతదేహాలను పోస్టుమార్టం నిమిత్తం దగ్గర్లోని ఆస్పత్రికి తరలించారు. నూతన వరుడు, వధువులు గుండెపోటుతో మృతి చెందినట్లు వైద్యులు నిర్ధారించారు. పోస్టుమార్టం అనంతరం వధూవరుల మృతదేహాలను ఒకే చితిపై ఉంచి అంత్యక్రియలు నిర్వహించారు. ప్రస్తుతం ఈ ఘటన వైరల్‎గా మారింది. ఒకేసారి ఇద్దరు గుండెపోటుతో మరణించడంపై అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కొత్త జంటల మరణం వెనుక ఏమైనా మిస్టరీ ఉందా అనే కోణంలో పోలీసుల దర్యాప్తు కొసాగుతోంది.


Updated : 5 Jun 2023 4:29 PM IST
Tags:    
Next Story
Share it
Top