Home > జాతీయం > భారీగా తగ్గనున్న వంట నూనెల ధరలు..ఎంతంటే?

భారీగా తగ్గనున్న వంట నూనెల ధరలు..ఎంతంటే?

భారీగా తగ్గనున్న వంట నూనెల ధరలు..ఎంతంటే?
X

కేంద్ర ప్రభుత్వం సామాన్య ప్రజలకు గుడ్ న్యూస్ చెప్పింది. రిఫైన్డ్‌ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ నూనెలపై దిగుమతి సుంకాన్నితగ్గిస్తూ జాతాగా నిర్ణయం తీసుకుంది. ఈ నిర్ణయంతో 17.5% ఉన్న దిగుమతి సుంకం 12.5 శాతానికి తగ్గనుంది. ఈ మధ్యకాలంలోనే వంట నూనెల ధరలు చుక్కలను తాకాయి. నూనెల ధరలు అమాంతం పెరుగడంతో సామాన్య ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ క్రమంలో కేంద్రం లేటెస్టుగా తీసుకున్న ఈ నిర్ణయంతో సామాన్యులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.




కేంద్రం తాజా తీసుకున్న నిర్ణయం గురువారం నుంచే అమలులోకి వచ్చింది. దేశీయంగా నూనెల లభ్యతను పెంచేందుకు అదే విధంగా ధరలను నియంత్రించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు కేంద్ర ఆర్థిక మంత్రిత్వ శాఖ ఓ ప్రకటనలో తెలిపింది. సాధారణంగా క్రూడ్‌ సోయాబీన్‌, సన్‌ఫ్లవర్‌ ఆయిల్స్‎ను దిగుమతి చేసుకుంటున్నాము. ఇప్పుడు రిఫైన్డ్‌ ఆయిల్స్‎పైనా ఇంపోర్ట్ డ్యూటీని తగ్గించింది. రిఫైన్డ్‌ వంట నూనెలపై ప్రస్తుతం దిగుమతి సుంకం 13.7 శాతంగా ఉంది.





Updated : 16 Jun 2023 11:30 AM IST
Tags:    
Next Story
Share it
Top