Home > జాతీయం > PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారు

PM Modi: ప్రధాని మోదీ తెలంగాణ పర్యటన షెడ్యూల్‌ ఖరారు
X

రాష్ట్రంలో ఎన్నికల ప్రచారానికి మరో 6 రోజులే గడువు ఉండడంతో.. రాజకీయ పార్టీలన్ని ప్రచారాన్ని ముమ్మరం చేశాయి. వరుస బహిరంగ సభలతో బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ ఓటర్లను ఆకట్టుకుంటున్నారు. కాంగ్రెస్ పార్టీ నేతలు కూడా రోడ్ షోలు, విజయభేరి సభలు నిర్వహిస్తూ జనాల్లో జోష్ నింపుతున్నారు. ఇక తామేమీ తక్కువకాదు అన్నట్లుగా మరో జాతీయ పార్టీ, బీజేపీ సైతం ప్రచార పర్వంలో మరింత దూకుడు పెంచింది. ప్రచారం క్లైమాక్స్‌కి చేరుకునే వేళ.. రంగంలోకి బీజేపీ అగ్రనేత, ప్రధాని మోదీని దించాలని భావిస్తోంది. ఏకంగా మూడు రోజుల పాటు ప్రధాన మంత్రి తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల ప్రచారంలో పాల్గొనున్నట్లు తెలిసింది.

ఇదే షెడ్యూల్...

షెడ్యూల్ ప్రకారం.. ప్రధాని మోదీ 25, 26, 27 తేదీల్లో ప్రచారంలో పాల్గొనున్నారు. తొలి రోజు(ఈ నెల 25 వ తేదీన) సీఎం కేసీఆర్ పోటీ చేస్తున్న కామారెడ్డిలో ఎన్నికల ప్రచారం ప్రారంభించనున్నారు మోడీ. ఆ రోజు మధ్యాహ్నం 1:25 గంటల పాంత్రంలో దుండిగల్ ఎయిర్‌పోర్ట్‌కి చేరుకొని, అక్కడి నుంచి కామారెడ్డిలో బీజేపీ ఏర్పాటు చేసిన భారీ బహిరంగంలో ప్రసంగించనున్నారు. ఆ సమావేశం అనంతరం రంగారెడ్డి జిల్లాకు బయలుదెరనున్నారు. సాయంత్రం 4:05 గంటలకు చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో సాయంత్రం 4:15 గంటల నుంచి 4:55 గంటల వరకు పాల్గొంటారు. ఈ సభ అనంతరం అక్కడి నుంచి బయల్దేరి 7:35 గంటలకు బేగంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అనంతరం రాజ్ భవన్‌కు చేరుకుంటారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు.

ఇక రెండవ రోజు పర్యటనలో భాగంగా..తొలుత ఉదయం 11:30 గంటల నుంచి మధ్యాహ్నం 12:45 గంటల వరకు కన్హయ్య శాంతివనంలో ఏర్పాటు చేసిన ప్రత్యేక కార్యక్రమంలో ప్రధాని మోడీ పాల్గొనున్నారు. ఈ కార్యక్రమం అనంతరం అక్కడి నుంచి నేరుగా దుబ్బాక నియోజకవర్గానికి మధ్యాహ్నం 2 గంటల వరకు చేరుకోనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన భారీ బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో దాదాపు అర గంట ప్రసంగించనున్నారు. ఈ సభ అనంతరం నిర్మల్‌లో నిర్వహించనున్న బహిరంగ సభకు ప్రధాని మోడీ హాజరుకానున్నారు. ఈ సభలో మధ్యాహ్నం 3:45 గంటల నుంచి సాయంత్రం 4:25 గంటల వరకు పాల్గొనున్నారు. అక్కడి నుంచి దుండిగల్ విమానాశ్రయానికి చేరుకుని.. సాయంత్రం 5:45 గంటల ప్రాంతంలో తిరుపతికి బయలుదేరనున్నారు. ఆ రోజు రాత్రి అక్కడే బస చేయనున్నారు.

మూడవ రోజు .. (27న) ఉదయం 11:30 గంటలకు తిరుపతి నుంచి బయలుదేరి హకీంపేట విమానాశ్రయానికి చేరుకుంటారు. అక్కడి నుంచి బయలు దేరి మధ్యాహ్నం 12:40 గంటల ప్రాంతంలో మహబూబాబాద్ చేరుకుంటారు. అక్కడ నిర్వహించే బహిరంగ సభలో మధ్యాహ్నం 12:45 గంటల నుంచి 1:25 గంటల వరకు పాల్గొంటారు. ఈ సభ అనంతరం కరీంనగర్ వెళ్లనున్నారు. అక్కడ ఏర్పాటు చేసిన బహిరంగ సభలో మధ్యాహ్నం 2:45 గంటల నుంచి 3:25 గంటల వరకు పాల్గొనున్నారు. ఆ సభ అనంతరం అక్కడి నుంచి బయలుదేరి సాయంత్రం 4:40 గంటల ప్రాంతంలో హైదరాబాద్ కు చేరుకొనున్నారు. బేగంపేట విమానాశ్రయం నుంచి ప్రారంభమయ్యే రోడ్ షో లో సాయంత్రం 5 గంటల నుంచి 6 గంటల వరకు పాల్గొంటారు.ఈ రోడ్ షో అనంతరం నేరుగా పలువురు కీలక నేతలతో భేటీ కానున్నారు. అనంతరం సాయంత్రం 6:25 గంటల ప్రాంతంలో ఢిల్లీకి తిరిగి బయలు దేరనున్నారు.




Updated : 23 Nov 2023 8:14 AM IST
Tags:    
Next Story
Share it
Top