కాంగ్రెస్-ఆప్ మధ్య కుదిరిన సీట్ల ఒప్పందం
X
లోక్ సభ ఎన్నికల వేళ ఇండియా కూటమికి బిగ్ రీలీఫ్ లభించింది. ఇన్నాళ్లూ మెల్లిమెల్లిగా దూరమవుతున్న పార్టీలతో ఇబ్బందులు పడ్డ ఇండియా కూటమి ఇప్పుడిప్పుడే తెరుకుంటుంది. పొత్తులోని పలు పార్టీల మధ్య సీట్ల సర్దుబాటు ప్రక్రియ ఓ దారికి వచ్చింది. ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఢిల్లీలో కాంగ్రెస్‌తో పొత్తుపై నేతలు క్లారిటీకి వచ్చారు. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో సీట్ల పంపకాలను నేతలు తెలిపారు. అయితే తాజాగా ఢిల్లీలోని ఆప్ పార్టీతో సీట్ల ఒప్పందం కుదిరింది.
ఇండియా కూటమిలో పొత్తులు పొడుస్తున్నాయి. సీట్లపై ఒక్కో పార్టీతో క్లారిటీ రావడంతో కాంగ్రెస్‌లో నూతనోత్సాహం ఉప్పొంగుతోంది. ఇప్పటికే రెండు రాష్ట్రాల్లో కాంగ్రెస్‌తో సీట్ల పంపకాలపై క్లారిటీ వచ్చింది. తాజాగా ఢిల్లీ యాప్ తో కూడా సీట్ల పంపకాలపై చర్చలు ఫలించాయి. కాగా మరో 6 రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలతో కాంగ్రెస్ చర్చలు సాగుతున్నాయి. త్వరలోనే ఈ రాష్ట్రాల్లో సీట్ల కేటాయింపు పూర్తవుతుందని పార్టీ పెద్దలు భావిస్తున్నారు.
ఇండియా కూటమిలో కాంగ్రెస్-ఆప్ మధ్య సీట్ల ఒప్పందం కుదిరింది. మూడు రాష్ట్రాల్లో లోక్‌సభ ఎన్నికలకు ఇరు పార్టీల సీట్ల సర్దుబాటు కొలిక్కి వచ్చాయి. లోక్‌సభ ఎన్నికల్లో ఢిల్లీ, గుజరాత్, హరియాణా రాష్ట్రాల్లో కలిసి పోటీ చేయాలని కాంగ్రెస్-ఆప్ నిర్ణయించుకుంది. ఢిల్లీలో 7 లోక్‌సభ స్థానాల్లో ఆప్ 4 స్థానాల్లో(న్యూ ఢిల్లీ, వెస్ట్, సౌత్, ఈస్ట్ ఢిల్లీ), కాంగ్రెస్ 3 (చాందిని చౌక్, నార్త్ ఈస్ట్ ఢిల్లీ, నార్త్ వెస్ట్ ఢిల్లీ) స్థానాల్లో పోటీ చేయనుంది. అయితే గుజరాత్‌లో కాంగ్రెస్ 24, ఆప్ 2 స్థానాల్లో (బరుచు, భావ్ నగర్) బరిలోకి దిగనుంది. హరియాణాలో 10 లోక్‌సభ స్థానాల్లో 9 స్థానాల్లో కాంగ్రెస్, ఒక్క చోట ఆప్ (కురుక్షేత్ర) పోటీ చేయనుంది. కానీ గోవా, పంజాబ్‌లో ఒంటరిగానే పోటీ చేయాలని ఇరు పార్టీలు నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది.
Kiran
కిరణ్.. జర్నలిజంలో 15ఏండ్ల అనుభవం ఉంది. ప్రస్తుతం Mic Tv Websiteలో Shift Inchargeగా పనిచేస్తున్నారు. గతంలో, ఈటీవీ -2, టీ న్యూస్, V6 న్యూస్ ఛానళ్లలో పని చేశారు. తెలంగాణ, ఏపీ రాజకీయాలు, జాతీయ, అంతర్జాతీయ, బిజినెస్, సినిమాలకు సంబంధించిన వార్తలు, విశ్లేషణలు రాయగలరు.