Home > జాతీయం > సామాన్యులకు అందుబాటులోకి సుప్రీంకోర్టు ఫైల్స్..చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్

సామాన్యులకు అందుబాటులోకి సుప్రీంకోర్టు ఫైల్స్..చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్

సామాన్యులకు అందుబాటులోకి సుప్రీంకోర్టు ఫైల్స్..చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్
X

సుప్రీంకోర్టు వద్దనున్న డిజిటల్ డేటాను భవిష్యత్‌లో క్లౌడ్ ఆధారిత మౌలిక సదుపాయంగా దేశ ప్రజలకు అందుబాటులోకి తీసుకురానుందన్నారు సుప్రీం కోర్టు చీఫ్ జస్టిస్ డీవై చంద్రచూడ్. ఈ మేరకు సుప్రీంకోర్ట్ 75 సంవత్సరాలు పూర్తి చేసుకున్న సందర్భంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఆయన మాట్లాడారు. సుప్రీంకోర్టు సామర్థ్యం ముందు కూడా స్ట్రాంగ్ గా ఉండాలంటే సవాళ్లను గుర్తించి, పరిష్కారం దిశగా చర్చలు మొదలుపెట్టాల్సిన అవసరం ఉందన్నారు. సుప్రీం కోర్ట్ రిపోర్టులు త్వరలో ప్రజలకు ఉచితంగా డిజిటల్ ఫార్మాట్‌లో అందుబాటులో వస్తాయని ఆశాభావం వ్యక్తం చేశారు. 1950 నుంచి 36,308 కేసులకు సంబంధించిన రిపోర్టులు అందుబాటులోకి వస్తాయని చెప్పారు. ఇందుకు సంబంధించిన 519 పుస్తకాలను డిజిటల్ ఫార్మాట్‌, బుక్‌మార్క్, యూజర్ ఫ్రెండ్లీ, ఓపెన్ యాక్సెస్‌తో అందుబాటులోకి తీసుకొస్తామని తెలిపారు.

భారత రాజ్యాంగం ద్వారా ప్రజలు తమకు తాము ఈ కోర్టును అందించుకున్నారని డీవై చంద్రచూడ్ అన్నారు. దేశ పౌరుల మధ్య పరస్పర గౌరవం గురించి రాజ్యాంగం చెబుతోందని వెల్లడించారు. భవిష్యత్‌లో దేశానికి సంబంధించిన రియల్-టైమ్ న్యాయ సమాచారాన్ని..అధునాతన సాంకేతికతతో కూడిన వార్‌రూమ్‌ను ప్రారంభించడానికి సిద్ధంగా ఉన్నామని వివరించారు. సుప్రీంకోర్టు నూతన వెబ్‌సైట్ ‘సుస్వాగతం’ ద్వారా 1.23 లక్షల ఫైల్స్‌ను డిజిటల్‌గా మార్చామన్నారు. ఈ కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజరైన ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఈ వేడుకలను ప్రారంభించారు.

Updated : 28 Jan 2024 5:20 PM IST
Tags:    
Next Story
Share it
Top