Home > జాతీయం > వేసవిలో కుక్కలు అందుకే రెచ్చిపోతున్నాయి...

వేసవిలో కుక్కలు అందుకే రెచ్చిపోతున్నాయి...

వేసవిలో కుక్కలు అందుకే రెచ్చిపోతున్నాయి...
X

ఈ మధ్యకాలంలో కుక్కల దాడులు విపరీతంగా పెరిగాయి. ముఖ్యంగా పిల్లలపై దాడులు చేస్తూ ప్రాణాలను తీస్తున్నాయి. కుక్కల దాడులకు తెలంగాణలో ఇప్పటికే పలువురు చిన్నారులు బలయ్యారు. ఈ నేపథ్యంలో హార్వర్డ్ యూనివర్సిటీ కీలక విషయాలను చెప్పింది. హార్వర్డ్ స్కూల్ ఆఫ్ పబ్లిక్ హెల్త్, హార్వర్డ్ మెడికల్ స్కూల్ పరిశోధకుల జాయింట్ టీమ్ నిర్వహించిన అధ్యయనంలో ఆసక్తికర విషయాలు వెలుగు చూశాయి.

కుక్కల దాడులకు వాతావరణంతో సంబంధం ఉందని శాస్త్రవేత్తలు గుర్తించారు. వాతావరణంలో జరిగే మార్పులతో కుక్కల ప్రవర్తన దారితప్పుతుందని చెప్పారు. ఉష్ణోగ్రతలు, యూవీ రేడియేషన్ లెవల్స్, ఓజోన్ లెవల్స్ పెరిగిన రోజుల్లో కుక్క కాట్లు గణనీయంగా పెరిగినట్లు శాస్త్రవేత్తలు వివరించారు. అదేవిధంగా భారీ వర్షపాతం నమోదైన రోజుల్లో కుక్క కాట్లు పెరిగే ఛాన్స్ ఉందని చెప్పారు.

నేచర్‌ జర్నల్‌ ఈ సైంటిఫిక్‌ రిపోర్ట్స్‌ను జూన్‌ 15న ప్రచురించింది. అమెరికాలోని 8 ప్రముఖ నగరాల్లో ఈ పరిశోధన 10 ఏళ్లపాటు కొనసాగింది. ఉష్ణోగ్రతల హీట్ ఎఫెక్ట్‌తో కుక్కలతో పాటు కోతులు, ఎలుకలు కూడా వికృత ప్రవర్తనకు గురవుతున్నట్లు పరిశోధకులు గుర్తించారు. ఎలుకలు పంటలు నాశనం చేయడం.. కోతులు మనుషులపై దాడులు చేయడం వంటి ఘటనలను ఆ కోవలోకే వస్తాయని స్టడీ రిపోర్ట్లో శాస్త్రవేత్తలు వివరించారు.


Updated : 22 Jun 2023 10:17 AM IST
Tags:    
Next Story
Share it
Top