Home > జాతీయం > Ayodhya : బాలరాముడి ప్రాణప్రతిష్ఠ.. ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు వీరే

Ayodhya : బాలరాముడి ప్రాణప్రతిష్ఠ.. ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు వీరే

Ayodhya : బాలరాముడి ప్రాణప్రతిష్ఠ.. ఆహ్వానం అందుకున్న తెలుగు ప్రముఖులు వీరే
X

యూపీలోని అయోధ్యలో నూతనంగా నిర్మించిన రామ మందిరం (Ayodhya Ram Mandir)లో ప్రాణ ప్రతిష్ఠ (Pran Pratishtha) కార్యక్రమానికి ఇప్పటికే అన్ని ఏర్పాట్లు పూర్తయ్యాయి. చరిత్రలో నిలిచి ఉండిపోయే ఈ ప్రాణ ప్రతిష్ఠ ఘట్టానికి మరికొన్ని గంటల సమయం మాత్రమే ఉంది. సోమవారం(జనవరి 22వ తేదీ) మధ్యాహ్నం.. 12 గంటల 29 నిమిషాల 8 సెకన్ల నుంచి 12 గంటల 30 నిమిషాల 32 సెకన్ల మధ్య ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ (PM Modi) రామాలయం గర్భగుడిలో బాలరాముడి విగ్రహాన్ని ప్రతిష్టించనున్నారు. 84 సెకన్లలోనే అయోధ్య శ్రీ రాముడికి ప్రాణ ప్రతిష్ఠ జరగబోతుంది. కన్నులపండవగా జరిగే ఈ వేడుకకు వివిధ రంగాలకు చెందిన ప్రముఖులను అతిథులుగా ప్రభుత్వం ఆహ్వానించింది. ఈ కార్యక్రమానికి వచ్చే అతిథులు సుమారు 8,000 మంది పేర్లతో జాబితాను సిద్ధం చేసింది. అందులో 506 మందిని అత్యంత ప్రముఖులుగా ఎంపిక చేసింది. ఆ ముఖ్య అతిథుల్లో మన తెలుగు రాష్ట్రాలకు చెందిన వారూ ఉన్నారు.

రామయ్య ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి రావాలంటూ శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి మాజీ ఉప రాష్ట్రపతి ఎం వెంకయ్యనాయుడుకి ఆహ్వానం అందింది. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబునాయుడు, తెలంగాణ మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావుకు ఆహ్వానం అందింది. ఆహ్వానపత్రిక రావడంతో అయోధ్య రామాలయ ప్రాణప్రతిష్ఠ కార్యక్రమానికి చంద్రబాబు హాజరవుతున్నారు. మెగాస్టార్ చిరంజీవి, జనసేన అధినేత పవన్ కల్యాణ్, జూనియర్ ఎన్టీఆర్, రాంచరణ్ దంపతులు, ప్రభాస్, అల్లు అర్జున్, దర్శక ధీరుడు రాజమౌళికి శ్రీరామజన్మభూమి తీర్థక్షేత్ర ట్రస్ట్ నుంచి ఆహ్వానం అందింది. భారత్ బయోటెక్ అధినేతలు క్రిష్ణఎల్లా, శాంత బయోటెక్ వ్యవస్థాపకులు వరప్రసాద్ రెడ్డి, ప్రముఖ వైద్యులు డాక్టర్ నాగేశ్వర్, యశోద హాస్పిటల్స్ ఛైర్మన్ దేవేందర్ రావు ఆహ్వానాలు అందాయి. బ్యాడ్మింట్ కోచ్ పుల్లెల గోపిచంద్, మాజీ క్రికెటర్ పూర్ణిమా రావు, భాగ్యనగర్ ఉత్సవ సమితి అధ్యక్షులు రాఘవరెడ్డి, చినజీయర్ స్వామికి అయోధ్య ట్రస్ట్ ఆహ్వానం పంపింది.




Updated : 21 Jan 2024 10:23 AM IST
Tags:    
Next Story
Share it
Top