Home > జాతీయం > Ayodhya : అయోధ్యలో రెచ్చిపోతున్న దొంగలు

Ayodhya : అయోధ్యలో రెచ్చిపోతున్న దొంగలు

Ayodhya : అయోధ్యలో రెచ్చిపోతున్న దొంగలు
X

అయోధ్యలో దొంగలు హాల్ చల్ చేస్తున్నారు. బాలరాముని దర్శనానికి వివిధ రాష్ట్రాల నుంచి భక్తులు భారీగా తరలివస్తున్నారు. ఇదే అదననుకొని దొంగలు రెచ్చిపోతున్నారు. ఇటీవల కాలంలో ఎన్నో దశాబ్దాలుగా వేచి చూసిన భారతీయుల కల నెరవెరింది. అయోధ్యలో బాలరాముని విగ్రహా ప్రతిష్టాపన అంగరంగ వైభవంగా జరిగింది. దీంతో రామ్ లల్లాను దర్శించుకునేందుకు భక్తులు అయోధ్యకు క్యూ కడుతున్నారు. భక్తుల రద్దీని అవకాశంగా తీసుకుంటూ కొంతమంది దొంగలు రెచ్చిపోతున్నారు. పర్యాటకుల డబ్బు, బంగారం, ఇతర విలువైన వస్తువులను ఎత్తుకెళ్తున్నారు.

ఇటీవల కాలంలో కరీంనగర్ కు చెందిన కొందరు భక్తులు బాలరాముని దర్శించుకునేందుకు అయోధ్యకు వెళ్లారు. అయితే అందులో ఓ మహిళ వద్ద బంగారాన్ని దొంగిలించారు. దీంతో, బాధితురాలు పోలీసులకు ఫిర్యాదు చేసింది. కాగా ఇప్పటివరకూ దాదాపు 60 మంది మహిళల మంగళ సూత్రాలు చోరీకి గురైనట్టు పోలీసులు తెలిపారు.

అయితే రామమందిర ప్రారంభోత్సవం తరువాత భద్రతా ఏర్పాట్లు కాస్తంత సడలించడంతో దొంగలు రెచ్చిపోతున్నారన్న విమర్శలు వినిపిస్తున్నాయి. పలు ప్రాంతాల్లో సీసీ కెమెరాలు కూడా తీసేయ్యడం దొంగలకు అవకాశంగా మారినట్టు సమాచారం.

Updated : 11 Feb 2024 8:23 AM GMT
Tags:    
Next Story
Share it
Top