Home > జాతీయం > డీఐజీ ఫోన్‌నే కొట్టేశారు..

డీఐజీ ఫోన్‌నే కొట్టేశారు..

డీఐజీ ఫోన్‌నే కొట్టేశారు..
X

అతనొక పెద్ద పోలీసు అధికారి. ఎన్నో కేసులను దర్యాప్తు చేసి నేరగాళ్ల ఆటకట్టించాడు. అలాంటి ఆఫీసర్‌కే ఊహించని కష్టం ఎదురైంది. అస్సాంకు చెందిన డీఐజీ వివేక్ రాజ్ సింగ్ ఫోన్‌ను ఎతుకెళ్లారు. గౌహతిలోని తన నివాస ప్రాంతంలో ఆదివారం ఉదయం మార్నింగ్ వాక్ చేస్తుండగా దొంగలు సెల్ ఫోన్ లాక్కెళ్లారు. ప్రస్తుతం ఈ ఘటన పోలీసు శాఖకు ఇబ్బందికరంగా మారింది. ఓ పోలీస్‌ ఉన్నతాధికారి ఫోన్‌నే దొంగలించడం చర్చనీయాంశమైంది. పోలీస్‌ హెడ్‌క్వార్ట్స్‌కు కూతవేటు దూరంలో ఉండే మజార్‌ రోడ్డులో ఈ ఘటన చోటుచేసుకుంది. మజార్‌ రోడ్డు పొడువునా అనేకమంది టాప్‌ ఐపీఎస్‌ అధికారుల నివాసాలు ఉంటాయి.

సెల్‌ఫోన్ చోరీపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. డీఐజీ మొబైల్‌ చోరీ చేసిన వారిని పట్టుకొనేందుకు గాలింపు కొనసాగుతోందని పోలీసులు పల్తాన్‌బజార్‌ పోలీస్‌స్టేషన్‌కు చెందిన ఓ అధికారి తెలిపారు.పలువురు సీనియర్‌ పోలీసు ఉన్నతాధికారులు సైతం ఈ ఘటనపై స్పందించేందుకు నిరాకరించారు.


Updated : 23 July 2023 10:22 PM IST
Tags:    
Next Story
Share it
Top