మీరేం దొంగలురా అయ్యా..! ఒక్క రాత్రిలో మాయం చేశారు!
X
దొంగల బీబత్సం ఎలా ఉంటుందో అందరికీ తెలిసిందే. చేతికి అందిందల్లా దోచుకుపోతుంటారు. ఇక నార్త్ దొంగల పనితీరు గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రాత్రికి రాత్రి రైలు పట్టాలు ఎత్తుకెళ్లిన ఘనులు ఉన్నారు. తాజాగా అలాంటి ఘటనే ఉత్తరప్రదేశ్ లోని మీరట్ లో జరిగింది. భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా దేశానికి ఎంత కీర్తి తెచ్చిపెట్టాడో అందరికీ తెలిసిందే. ఒలంపిక్స్, అంతర్జాతీయ టోర్నీల్లో దేశానికి గోల్డ్ మెడల్ సాధించి పెట్టాడు. ఆయన కీర్తికి, సాధించిన విజయాలకు గుర్తుగా నీరజ్ ను గౌరవిస్తూ ఉత్తరప్రదేశ్ గవర్నమెంట్ ఓ ఆలోచన చేసింది.
మీరట్ లోని హాపూర్ అడ్డాలో ఎండీఏ (మీరట్ డెవలప్మెంట్ అథారిటీ) అధికారులు నీరజ్ చోప్రా విగ్రహాన్ని ఆవిష్కరించారు. జావలిన్ విసుతున్నట్లు ఉన్న నీరజ్ విగ్రహానికి నిజమైన ఈటెను అమర్చారు. నిత్యం రద్దీగా ఉండే ఆ ప్రాంతానినికి నీరజ్ విగ్రహం ప్రత్యేక ఆకర్శనగా నలిచింది. కాగా సోమవారం రాత్రి కొందరు దొంగలు విగ్రహం చేతిలో ఉన్న ఈటెను ఎత్తుకెళ్లారు. అది గమనించిన పోలీసులు ఒక్కసారిగా అవాక్కయ్యారు. దీనిపై పోలీసులు సీసీ ఫుటేజీ ఆధారంగా దర్యాప్తు చేస్తున్నారు. త్వరలో దొంగలను పట్టుకుంటామని తెలిపారు.