Home > జాతీయం > నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్.. మోదీ ఏమన్నారంటే..?

నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్.. మోదీ ఏమన్నారంటే..?

నిర్మలమ్మ మధ్యంతర బడ్జెట్.. మోదీ ఏమన్నారంటే..?
X

మరో మూడు నెలల్లో సార్వత్రిక ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో కేంద్రం మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టింది. కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వరుసగా ఆరోసారి బడ్జెట్ ప్రవేశపెట్టారు. ఈ బడ్జెట్తో మొరార్జీ దేశాయ్ పేరిట ఉన్న రికార్డును ఆమె సమం చేశారు. ఈ బడ్జెట్లో పలు రంగాలకు కేంద్రం ఊరటనిచ్చింది. నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన ఈ బడ్జెట్ పై ప్రధాని మోదీ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 2047 నాటికి భారత్ అభివృద్ధి చెందిన దేశంగా నిలిచేందుకు ఈ బడ్జెట్ ఎంతో నమ్మకాన్ని ఇచ్చిందన్నారు.

యువ భారత్ ఆకాంక్షలను ఈ బడ్జెట్ ప్రతిబింబిస్తోందని అని మోదీ అన్నారు. టెక్నాలజీ రంగంలో పరిశోధన, సరికొత్త ఆవిష్కరణల కోసం రూ.లక్ష కోట్ల నిధిని ఏర్పాటు చేశామని చెప్పారు. యువతకు ఉపాధి అవకాశాలు మెరుగవుతాయన్నారు. వచ్చే ఐదేళ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2కోట్ల ఇళ్లు నిర్మిస్తామని తెలిపారు. లఖ్పతి దీదీస్ పథకాన్ని 3కోట్ల విస్తరిస్తున్నట్లు వివరించారు. సామాన్యులపై భారం మోపకుండా వారి జీవన విధానాన్ని మరింత ఈజీగా మార్చడమే ఈ మధ్యంతర బడ్జెట్ లక్ష్యమని మోదీ స్పష్టం చేశారు.

జీడీపీకి కొత్త అర్ధం

ప్రపంచ దేశాలు ఎన్నో ఒడిదొడుకులు ఎదుర్కొంటున్నా భారత్ మాత్రం వాటన్నింటినీ అధిగమించి అభివృద్ధి పథంలో పయనిస్తోందని కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ అన్నారు. మోడీ పాలనలో ప్రజల ఆదాయం 50శాతం పెరిగిందని చెప్పారు. బస్తీలు, కిరాయి ఇండ్లలో ఉండేవారి సొంతింటి కల నిజం చేస్తామని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా వచ్చే ఐదేండ్లలో పీఎం ఆవాస్ యోజన కింద 2కోట్ల ఇళ్లు నిర్మించనున్నట్లు చెప్పారు. రూఫ్‌ టాప్‌ సోలార్‌ పాలసీ కింద కోటి ఇళ్లకు 300 యూనిట్ల ఉచిత విద్యుత్‌ అందిస్తున్నట్లు నిర్మల ప్రకటించారు. మోడీ హయాంలో జీడీపీ అంటే గవర్నెన్స్, డెవలప్ మెంట్, పెర్మార్మెన్స్ అని కొత్త అర్థం ఇచ్చామని చెప్పారు

Updated : 1 Feb 2024 10:40 AM GMT
Tags:    
Next Story
Share it
Top