శివశక్తి పేరు అందుకే పెట్టాను-ప్రధాని మోదీ
X
చంద్రయాన్-3 దిగిన ప్రదేశానికి శిశక్తి అనే పేరు పెట్టారు ప్రధాని నరేంద్రమోడీ. ఈరోజు బెంగళూరు నుంచి ఢిల్లీ చేరుకున్న ఆయన ఎయిర్ పోర్ట్ లో బీజెపీ నేతలు ఏర్పాటు చేసిన సమావేశంలో మాట్లాడారు. ఇందులో భాగంగానే ఆయన ల్యాండింగ్ ప్రదేశానికి శివశక్తి పేరు ఎందుకు పెట్టారో తెలిపారు.
శివ అనే పదాన్ని భారతీయులు శుభంగా భావిస్తారు. ఇక మన స్త్రీల గురించి మాట్లాడినప్పుడు శక్తి పదాన్ని వాడతాం. అందుకే ల్యాండింగ్ అయిన ప్రదేశానికి ఆ పేరును సూచించానని చెప్పుకొచ్చారు ప్రధాని మోదీ. అలాగే చంద్రయాన్-2 క్రాష్ ల్యాండ్ అయిన ప్రదేశానికి కూడా గుర్తింపునిద్దాం...దాన్ని తిరంగా పాయింట్ అని పిలుచుకుందాం అని అన్నారు. చంద్రయాన్-3 సాధించిన సక్సెస్ కు ప్రపంచదేశాల నుంచి ఎన్నో అభినందనలు వచ్చాయని తెలిపారు. నాకు చాలా మెసేజ్ లు వచ్చాయని అన్నారు.
ఢిల్లీలో జీ20 సదస్సులు జరగనున్నాయి. సెప్టెంబర్ 5 నుంచి 15 వరకు భారీ సంఖ్యలో ఇక్కడకు అతిధులు వస్తారు. దీనివలన ట్రాఫిక్ ఆంక్షలు మరతాయి. ప్రజలు ఇబ్బందులు పడవలసి వస్తుంది. కాబట్టి ఢిల్లీ వాసులు కొంచెం సహనంతో ఉండాలని విజ్ఞప్తి చేస్తారు ప్రధాని. వారికి ఈ విషయంలో ముందుగానే ఢిల్లీ ప్రజలకు క్షమాపణలు చెబుతున్నాని చెప్పారు మోదీ.