Home > జాతీయం > ముగ్గురు జవాన్ల వీరమరణం

ముగ్గురు జవాన్ల వీరమరణం

ముగ్గురు జవాన్ల వీరమరణం
X

జమ్మూకశ్మీర్‌లో పాకిస్తాన్ ఉగ్రమూకల దాడులు ఆగడం లేదు. ముష్కరులకు, భద్రతా బలగాలకు మధ్య జరిగిన ఎన్‌కౌంటరులో ముగ్గురు సైనికులు వీరమరణం పొందారు. కొందరు జవాన్లు గాయపడ్డారు. దక్షిణ కశ్మీర్‌లోని కుల్గాం జిల్లా హాలన్ అడవుల్లో కొందరు ఉగ్రవాదులు దాక్కుని ఉన్నారని సమాచారం అండడంతో ఆర్మీ, రాష్ట్ర పోలీసుల బలగాలు శుక్రవారం నుంచి భారీ స్థాయిలో గాలింపు జరిపాయి. ఉగ్రవాదులు కాల్పులు జరపగా బలగాలు తిప్పికొట్టాయి. ఈ ఘటనలో ముగ్గురు జవాన్లు చనిపోయారు. ఆర్మీ ధాటికి ముష్కరులు తోక ముడిచి పారిపోయారు. వారి అంతు తేల్చడానికి భారీగా స్థాయిలో కూంబింగ్ సాగుతోందని ఆర్మీ తెలిపింది.

Updated : 5 Aug 2023 7:45 AM IST
Tags:    
Next Story
Share it
Top