Home > జాతీయం > రైల్వే ట్రాక్​పై ఆటలు..ముగ్గురు చిన్నారులు మృతి

రైల్వే ట్రాక్​పై ఆటలు..ముగ్గురు చిన్నారులు మృతి

రైల్వే ట్రాక్​పై ఆటలు..ముగ్గురు చిన్నారులు మృతి
X

తమిళనాడు రాజధాని చెన్నై శివార్లలో తీవ్ర విషాద ఘటన చోటుచేసుకుంది. రైల్వే ట్రాక్‌పై ఆడుకుంటున్న ముగ్గురు దివ్యాంగ చిన్నారులు.. రైలు ఢీకొని అక్కడికక్కడే మృతి చెందారు. రైలు శబ్దం వారికి వినిపించకపోవడమే తీవ్ర విషాదానికి కారణమని పోలీసులు అనుమానిస్తున్నారు. వివరాల్లోకి వెలితే.. కర్ణాటకలోని తోప్పుర్‌కు చెందిన సంజం పన్నన్, అతడి తమ్ముడు అనుమంతప్ప కుటుంబాలు కొన్నేళ్లుగా తమిళనాడులో నివసిస్తున్నాయి. చెన్నై శివార్లలో ఓ అద్దె ఇంట్లో నివాసం ఉంటూ భిక్షాటన చేసుకుంటూ జీవిస్తున్నాయి. అయితే వీరి పిల్లలు సురేశ్ (15), రవి (10), మంజునాథ్​ (11) కర్ణాటకలోనే తమ అమ్మమ్మ దగ్గర ఉండి చదువుకుంటున్నారు.

ముగ్గురు పిల్లల్లో సురేశ్, రవి బధిరులు కాగా.. మంజునాథ్​ పుట్టుకతో మూగవాడు. దసరా సెలవులు కావడంతో తమిళనాడులో సొంతూళ్లలో ఉంటున్న తమ తల్లిదండ్రుల వద్దకు వచ్చారు. మంగళవారం మధ్యాహ్నం ముగ్గురూ కలసి.. ఉరప్పక్కం సమీపంలో ఉన్న రైలు పట్టాలపై ఆడుకునేందుకు వెళ్లారు. అదే సమయంలో చెన్నై బీచ్​స్టేషన్​నుంచి చెంగల్​పట్టు వెళ్తున్న ఓ విద్యుత్ రైలు వారిని ఢీకొట్టింది. దీంతో ముగ్గురు అక్కడికక్కడే మరణించారు. దీంతో ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు.. ముగ్గురు బాలుర మృతదేహాలను శవపరీక్షల కోసం స్థానిక ఆస్పత్రికి తరలించారు. ఘటనపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేపట్టారు.




Updated : 25 Oct 2023 10:00 AM IST
Tags:    
Next Story
Share it
Top