Home > జాతీయం > ఆఫీసులో దుష్టశక్తులున్నాయని ప్రభుత్వోద్యోగులతో ప్రార్థన!!

ఆఫీసులో దుష్టశక్తులున్నాయని ప్రభుత్వోద్యోగులతో ప్రార్థన!!

ఆఫీసులో దుష్టశక్తులున్నాయని ప్రభుత్వోద్యోగులతో ప్రార్థన!!
X

ప్రభుత్వ కార్యాలయంలో దుష్టశక్తులున్నాయని.. వాటిని తొలగించాలంటూ అక్కడ పనిచేస్తున్న ఉద్యోగులతో ప్రార్థనలు చేయించారు ఓ ఉన్నతాధికారి. కేరళలోని త్రిసూర్ జిల్లా చిన్నారుల సంరక్షణ అధికారి కార్యాలయంలో ఈ ఘటన జరిగింది. "నెగటివ్ ఎనర్జీ"ని అరికట్టడానికి చైల్డ్ ప్రొటెక్షన్ యూనిట్ కార్యాలయంలో ప్రార్థనలు చేసినట్లు వచ్చిన నివేదికలపై త్రిసూర్ జిల్లా యంత్రాంగం విచారణకు ఆదేశించింది. సెప్టెంబర్ మొదటి వారంలో ఈ సంఘటన జరిగినట్లు త్రిసూర్‌ కలెక్టర్‌ వీఆర్‌ కృష్ణతేజకు రిపోర్ట్ అందడంతో.. దీనిపై విచారణ జరపాలని సబ్‌ కలెక్టర్‌ను ఆదేశించారు.

త్రిసూర్ జిల్లా చైల్డ్ ప్రొటెక్షన్ అధికారి బిందు సూచన మేరకు ఈ ప్రార్థన జరిగినట్లు ఆరోపణలు ఉన్నాయి. ఆఫీసులో కాంట్రాక్టు ఉద్యోగుల రాజీనామాలతోపాటు కార్యాలయంలో అనేక సమస్యలు జరుగుతున్నందున.. ఉద్యోగులందరినీ అత్యవసర సమావేశం కావాలని ఆదేశించారు బిందు. ఆ రోజున ఆఫీస్ సమయానికి ముందే.. మతపరంగా పవిత్రంగా భావించే ఓ పుస్తకాన్ని చేతిలో పట్టుకుని ప్రార్థన చేపట్టారు. కార్యాలయంలో ఉన్నతాధికారి మినహా మిగిలినవారు ఒప్పంద ఉద్యోగులు కావడం వల్ల ఎవరూ నోరు మెదపలేదు. అయితే, తాజాగా కలెక్టర్​ దృష్టికి రావడం వల్ల దర్యాప్తునకు ఆదేశించారు.

Updated : 14 Nov 2023 8:40 AM IST
Tags:    
Next Story
Share it
Top