Home > జాతీయం > చికెన్ ఫ్రీగా ఇవ్వలేదని.. దళిత వ్యక్తిపై దాడి

చికెన్ ఫ్రీగా ఇవ్వలేదని.. దళిత వ్యక్తిపై దాడి

చికెన్ ఫ్రీగా ఇవ్వలేదని.. దళిత వ్యక్తిపై దాడి
X

చికెన్ ఐటమ్ ఏదైనా లొట్టలేసుకుని తినేవాళ్లు చాలామందే ఉంటారు. ఇక స్పెషల్ అకేషన్స్ లో అయితే.. చికెన్ లేనిదే నోట్లోకి ముద్ద దిగదు. రేటెంతైనా పరవాలేదంటూ చికెన్ వండుకుని తింటుంటారు. అయితే, ఫ్రీగా చికెన్ ఇవ్వలేదంటూ ఓ దళిత వ్యక్తిపై దాడి చేశారు. దీనికి సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ అమానవీయ ఘటన ఉత్తర్ ప్రదేశ్ లో జరిగింది. సుజన్ అహిర్ వార్ అనే వ్యక్తి బైక్ పై ఊరూరా తిరుగుతూ చికెన్ అమ్ముతుంటాడు. ఈ క్రమంలో ఒక ఊరు నుంచి మరో ఊరుకు వెళ్తుండగా.. మార్గ మధ్యలో కొందరు సుజన్ ను అడ్డుకుని.. చికెన్ ఇవ్వమని అడిగారు. దానికి సుజన్ డబ్బులిస్తేనే చికెన్ ఇస్తాను అనగా.. కొనడానికి వచ్చిన వ్యక్తులు చెప్పులతో సుజన్ ను చితకబాదారు.





ఈ ఘటనను వీడియో తీసిన స్థానిక వ్యక్తి సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఈ ఘటనపై కేసు నమోదు చేసిన పోలీసులు.. నిందితులను పట్టుకునేందుకు రంగంలోకి దిగారు. కాగా, ఈ ఘటనపై దళిత సంఘాలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. పొట్టకూటి కోసం పనిచేస్తే దళిత వ్యక్తిపై దాడిచేయడం సరికాదని మండిపడుతున్నారు. నిందితులను పట్టుకుని కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేస్తున్నారు.






Updated : 13 Aug 2023 9:30 PM IST
Tags:    
Next Story
Share it
Top