Home > జాతీయం > వామ్మో...టిఫిన్స్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి..!

వామ్మో...టిఫిన్స్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి..!

వామ్మో...టిఫిన్స్ ధరలు కూడా పెరిగిపోతున్నాయి..!
X

దేశంలో నిత్యవసరాల ధరలు మండిపోతున్నాయి. పప్పు ఉప్పుల నుంచి కూరగాయల వరకు అన్నీ ధరలకు రెక్కలొచ్చాయి. కందిపప్పు, మినపపప్పు, పెసరపప్పులతో ఇతర వస్తువులు కొనాలంటే సామాన్యుడికి పెను భారం అవుతోంది. టమాటా, పచ్చిమిర్చి వంటివి గురించి ఇక చెప్పక్కర్లేదు. కిలో టమాటా 100 నుంచి 200 వరకు పలుకుతోంది. వాటి ప్రభావం ప్రత్యక్షంగా కాకుండా పరోక్షంగా కూడా ప్రభావం చూపుతున్నాయి.

తాజాగా మరో వార్త గుబేలు పుట్టిస్తోంది. నిత్యావసర వస్తువులు ధరల ఎఫెక్ట్ టిఫిన్స్ ధరలపై పడింది. కడుపునిండా బయట టిఫిన్ చేయాలంటే ఇక కాస్త ఆలోచించాల్సిందే. ఎందుకంటే పలు ప్రాంతాల్లో టిఫిన్స్ ధరలు అమాంతం పెరిగిపోయాయి. నిత్యావసర ధరలు పెరగడంతో టిఫిన్ ధరలను 10 శాతం మేరకు పెంచాలని బృహత్ బెంగళూరు హోటళ్ల సంఘం నిర్ణయించింది. ఈ మేరకు సంఘం కార్యదర్శి ప్రకటన విడుదల చేశారు. ఆగస్టు 1 నుండి టీ దగ్గర నుండి టిఫిన్, స్నాక్స్ అన్ని ధరలు పెరగనున్నట్లు తెలిపారు. స్నాక్స్ రూ.5, ఇక మధ్యాహ్న భోజనానికి రూ.10 పెరగనుంది. ఇక హైదరాబాద్ నగరంలో ఇప్పటికే ధరల పట్టికలో మార్పులు చోటుచేసుకున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో పలు ప్రాంతాల్లో టిఫిన్స్ రేట్లు మార్పులు కనిపిస్తున్నాయి.

Updated : 26 July 2023 10:04 PM IST
Tags:    
Next Story
Share it
Top