Home > జాతీయం > బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆర్‌బీఐ కీలక ప్రకటన

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆర్‌బీఐ కీలక ప్రకటన

బ్యాంక్ కస్టమర్లకు అలర్ట్.. ఆర్‌బీఐ కీలక ప్రకటన
X

బ్యాంకుల పెద్దన్న, దేశీ కేంద్ర బ్యాంక్ రిజర్వు బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఆర్‌బీఐ RBI) కీలక నిర్ణయం తీసుకుంది. వడ్డీ రేట్లకు సంబంధించి ముఖ్యమైన ప్రకటన చేసింది. కీలక పాలసీ రేటు అయిన రెపో రేటును స్థిరంగానే కొనసాగించింది. ఆర్‌బీఐ ముఖ్యమైన పాలసీ రేట్లను స్థిరంగా కొనసాగించడం ఇది వరుసగా మూడో సారి కావడం గమనార్హం. ఆర్‌బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ సారథ్యంలోని ఎంపీసీ కమిటీ తాజా పాలసీ సమీక్షలో రెపో (Repo) రేటును నిలకడగానే కొనసాగింది. దీంతో రెపో రేటు 6.5 శాతం వద్దనే ఉంది.

ఆర్‌బీఐ రెపో రేటు స్థిరంగా కొనసాగడం వల్ల బ్యాంక్ ఖాతాదారులపై ప్రభావం పడే ఛాన్స్ ఉందని నిపుణులు పేర్కొంటున్నారు. ఎందుకంటే ఇప్పటికే బ్యాంకులు ఎఫ్‌డీ రేట్లను తగ్గిస్తూ వస్తున్నాయి. ఇప్పుడు రెపో రేటు స్థిరంగా ఉండటం వల్ల ఎఫ్‌డీ రేట్ల పైకి చేరకపోవచ్చని తెలియజేస్తున్నారు. అలాగే బ్యాంకులు మరింత వడ్డీ రేట్లను తగ్గించొచ్చనే అంచనాలు ఉన్నాయి. ఇదే జరిగితే బ్యాంక్‌లో డబ్బులు దాచుకునే వారిపై ప్రతికూల ప్రభావం పడుతుందని చెప్పుకోవచ్చు.

రూ.2000 నోట్ల‌ గురించి మాట్లాడుతూ.. ఇప్ప‌టి వ‌ర‌కు 87 శాతం రూ.2000 నోట్లు త‌మ వ‌ద్ద‌కు వ‌చ్చిన‌ట్లు ఆర్బీఐ గ‌వ‌ర్న‌ర్ శ‌క్తికాంత్ దాస్ తెలిపారు. ఇవాళ ద్ర‌వ్య ప‌ర‌ప‌తి క‌మిటీ నివేదిక‌ను ఆయ‌న ప్ర‌క‌టించారు. ఈ నేప‌థ్యంలో ఆయ‌న మాట్లాడుతూ.. 2వేల నోట్ల‌ను విత్‌డ్రా చేయ‌డం వ‌ల్ల మొత్తం మీద కావాల్సినంత మిగులు న‌గ‌దు ఉన్న‌ట్లు ఆయ‌న స్ప‌ష్టం చేశారు. ఇక బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లోకి 2వేల నోట్లు 87 శాతం వ‌చ్చేసిన‌ట్లు ఆయ‌న తెలిపారు. త‌మ విశ్లేష‌ణ‌లు, అంచ‌నాల ప్ర‌కారం బ్యాంకింగ్ వ్య‌వ‌స్థ‌లో అద‌న‌పు న‌గ‌దు ఉన్న‌ట్లు వెల్ల‌డించారు.




Updated : 10 Aug 2023 8:41 AM GMT
Tags:    
Next Story
Share it
Top