ఎగిరేది కాషాయం జెండానే.. టైమ్స్ నౌ ఒపీనియన్ పోల్
X
దేశంలో పొలిటికల్ హీట్ పెరిగింది. మొత్తం ఐదు రాష్ట్రాల్లో అసెంబ్లీ ఎన్నికలు జరుగనుండగా.. ఈసీ కసరత్తులు చేస్తుంది. కొన్ని సంస్థలు ఆయా రాష్ట్రాల్లో ఏ పార్టీ గెలుస్తుందని ఇప్పటికే సర్వేలు మొదలుపెట్టాయి. కాగా టైమ్స్ నౌ రాజస్థాన్ లో చేపట్టిన సర్వేలో బీజేపీ ఘన విజయం సాధిస్తుందని తేలింది. బీజేపీకి స్పష్టమైన మెజారిటీ వస్తుందని, డిసెంబర్ 3 తర్వాత బీజేపీ ప్రభుత్వం ఏర్పడుతుందని తాజా ఒపీనియన్ పోల్ లో తేలింది. పోల్ ప్రకారం బీజేపీ 114 నుంచి 124 స్థానాల్లో గెలుస్తుందని తెలుస్తుంది. కాగా ప్రధాన పార్టీలు బీజేపీ, కాంగ్రెస్ మధ్యే పోటీ ఉంటుందని, వేరే పార్టీలు, స్వతంత్ర అభ్యర్థుల ప్రభావం నామమాత్రమేనని ఓటర్లు అభిప్రాయపడ్డారు.
రాజస్థాన్ లో మొత్తం 200 నియోజకవర్గాలు ఉండగా.. వాటన్నింటిలో నవంబర్ 25న ఎన్నికలు జరుగనున్నాయి. ఈసీ డిసెంబర్ 3న కౌంటింగ్ నిర్వహించి ఫలితాలు వెల్లడిస్తుంది. ఈ నేపథ్యంలో రాజస్థాన్ గడ్డపై ఏ పార్టీ అధికారం చేపడుతుందని టైమ్స్ నౌ నవభారత్, ఈటీజీ ఈ ఒపీనియన్ పోల్ ను నిర్వహించింది. సగటున రాజస్థాలన్ లోని ప్రతీ నియోజక వర్గంలో 105 మంది ఓటర్ల లెక్కన మొత్తం 21,136 మండి ఓటర్లను ప్రశ్నించింది. అందులో అధికార కాంగ్రెస్ కు కేవలం 68 నుంచి 78 సీట్లు వస్తాయని, బీజేపీకి మాత్రం 114 నుంచి 124 సీట్లు వస్తాయని తేలింది.