Home > జాతీయం > బీజేపీకి ఇవాళ బిగ్ డే.. ఒకేరోజు నలుగురు పెద్ద లీడర్ల ప్రచారం

బీజేపీకి ఇవాళ బిగ్ డే.. ఒకేరోజు నలుగురు పెద్ద లీడర్ల ప్రచారం

బీజేపీకి ఇవాళ బిగ్ డే.. ఒకేరోజు నలుగురు పెద్ద లీడర్ల ప్రచారం
X

రాష్ట్రంలో తగ్గిన బీజేపీ గ్రాఫ్ ను ఈ ఐదు రోజుల్లో పెంచేందుకు బీజేపీ అధిష్టానం సిద్దం అవుతుంది. రానున్న ఎన్నికల్లో గెలుపే లక్ష్యంగా.. జనసేనతో పొత్తుపెట్టుకుని బరిలోకి దిగుతుంది. అధిష్టానం పెద్దలు ఒక్కొక్కరిగా రాష్ట్రానికి క్యూ కడుతున్నారు. కాగా ఇవాళ (నవంబర్ 25) తెలంగాణ బీజేపీ చరిత్రలో బిగ్ డే కాబోతుంది. ఎందుకంటే.. బీజేపీ అధిష్టానం నలుగురు పెద్దలు.. ప్రధాని మోదీ, అమిత్ షా, జేపీ నడ్డా, యోగీ ఆధిత్యనాథ్ లు రాష్ట్రంలో ప్రచారం చేయనున్నారు. రోడ్ షోలు, భారీ బహిరంగ సభల్లో పాల్గొంటారు. మోదీ ఇవాళ ఎన్నికల ప్రచారం నిర్వహించనున్నారు. మధ్యాహ్నం 1: 25 గంటలకు దుండిగల్ ఎయిర్ పోర్టుకు చేరుకోనున్న మోదీ.. మధ్యాహ్నం 2: 05 గంటలకు కామారెడ్డి బహిరంగ సభలో పాల్గొంటారు. తర్వాత సాయంత్రం 4: 05 గంటలకు తుక్కుగూడ బహిరంగ సభలో బీజేపీ తరఫున ప్రచారం నిర్వహిస్తారు. అనంతరం రాత్రికి రాజ్ భవన్ లో బస చేస్తారు. రేపు కూడా (ఆదివారం) మోదీ పలు నియోజకవర్గాల్లో ప్రచారం చేయనున్నారు.

అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తున్న వేళ హైదరాబాద్ పై బీజేపీ మరింత ఫోకస్ పెట్టింది. ఇప్పటికే రాష్ట్రంలో ప్రచారంలో ఉన్న కేంద్ర మంత్రి అమిత్ షా.. ఇవాళ ఉదయం 10 గంటలకు హైదరాబాద్ లో ప్రెస్మీట్ నిర్వహిస్తారు. ఉదయం 11: 30 గంటలకు కొల్లాపూర్లో నిర్వహించే బహిరంగ సభకు హాజరవుతారు. మధ్యాహ్నం ఒంటి గంటకు మునుగోడులో ఏర్పాటుచేసిన బహిరంగ సభ పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు పటాన్ చెరులో ఏర్పాటుచేసిన బహిరంగ సభ ప్రసంగిస్తారు. సాయంత్రం 4 గంటలకు ఖైరతాబాద్ లో రోడ్ షో నిర్వహిస్తారు. బీజేపీ జాతీయ అధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ రోడ్ షోలో పాల్గొంటారు. సాయంత్రం 4 గంటలకు సికింద్రాబాద్ లో, సాయంత్రం 6 గంటలకు ముషీరాబాద్ లో నిర్వహించనున్న రోడ్ షోలో పాల్గొంటారని బీజేపీ ప్రతినిధులు తెలిపారు. ఈ కార్యక్రమాల్లో జేపీ నడ్డాతో పాటు కేంద్రమంత్రి కిషన్ రెడ్డి, ఎంపీ డాక్టర్ కే. లక్ష్మణ్ తదితరులు పాల్గొననున్నారు.

వీరితో పాటు రాష్ట్ర రాజకీయాన్ని మరింత వేడెక్కించేందుకు ఉత్తరప్రదేశ్ సీఎం యోగి ఆదిత్య నాథ్ ఇవాళ తెలంగాణకు రానున్నారు. శనివారం హైదరాబాద్ లో రోడ్ షో, కార్నర్ మీటింగ్లలో పాల్గొంటారు. మధ్యాహ్నం 2 గంటలకు సనత్ నగర్ లో కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారు. అనంతరం మధ్యాహ్నం 2.30 గంటలకు మోండా మార్కెట్ మహంకాళి మందిర్ ప్రాంతంలో నిర్వహించే రోడ్ షోలో, మధ్యాహ్నం 3.30 గంటలకు గోషామహల్ కార్నర్ మీటింగ్ లో పాల్గొంటారని బీజేపీ ప్రతినిధులు తెలిపారు. సిర్పూర్, వేములవాడ, గోషామహల్ లో జరిగే సకల జనుల విజయ సంకల్ప సభల్లో ఆయన ప్రసంగించనున్నారు. మరోవైపు బీజేపీ జాతీయాధ్యక్షుడు జేపీ నడ్డా ఇవాళ 3 సెగ్మెంట్లలో ప్రచారం చేయనున్నారు. హుజూర్నగర్, సికింద్రాబాద్, ముషీరాబాద్ నియోజకవర్గంలో జరిగే రోడ్ షోలో ఆయన పాల్గొననున్నారు.




Updated : 25 Nov 2023 3:02 AM GMT
Tags:    
Next Story
Share it
Top