Home > జాతీయం > CM Nitish Kumar : నేడు బీహార్ సీఎం నితీశ్కు బల పరీక్ష..నెగ్గేనా?

CM Nitish Kumar : నేడు బీహార్ సీఎం నితీశ్కు బల పరీక్ష..నెగ్గేనా?

CM Nitish Kumar  : నేడు బీహార్ సీఎం నితీశ్కు బల పరీక్ష..నెగ్గేనా?
X

బీహర్ ముఖ్యమంత్రి నితీశ్ కుమార్ నేడు అసెంబ్లీలో బలపరీక్షను ఎదుర్కోబోతున్నారు. అయితే ఎమ్మెల్యేలను కాపాడుకునేందుకు ఆర్జేడీ, జేడీయూ సహా వివిధ పార్టీలు వారిని గృహ నిర్బంధంలో ఉంచినట్లు తెలుస్తోంది. కాగా పాట్నాలో జేడీయూ ఏర్పాటు చేసిన విందుకు ముగ్గురు ఎమ్మెల్యేలు గైర్హాజరవ్వటం కలకలం రేపింది. దీంతో బల పరీక్షపై సర్వాత్ర ఆసక్తి నెలకొంది. అయినప్పటికీ..నేడు జరగబోయే బలపరీక్షలో గెలుస్తామని సీఎం నితీశ్‌కుమార్‌ ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఈ నేపథ్యంలో మహాగట్‌బంధన్‌ (ఆర్జేడీ, కాంగ్రెస్‌, సీపీఐ(ఎంఎల్‌)), ఎన్డీయే కూటమి మధ్య మాటల యుద్ధం మొదలైంది.

ఆర్జేడీ ఎమ్మెల్యేలందర్నీ తేజస్వీ యాదవ్‌ గృహ నిర్బంధంలో ఉంచారని బీజేపీ నేతలు ఆరోపించారు. ఇది పూర్తిగా అవాస్తమని ఆర్జేడీ..సోషల్‌మీడియాలో ఓ వీడియోను విడుదల చేసింది. అటు ఉంచితే గత కొన్ని రోజులుగా గయలోని మహాబోధి రిసార్ట్‌లో ఉన్న బీజేపీ ఎమ్మెల్యేలు ప్రత్యేక బస్సుల్లో పాట్నాకు చేరుకున్నారు.

అయితే ప్రస్తుతం బీహార్ అసెంబ్లీలో 243 స్థానాలు ఉన్నాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 122 మంది సభ్యుల బలం అవసరం. అయితే బీజేపీ-78, జేడీయూ-45, హెచ్‌ఏఎం(ఎస్‌)-4, ఐఎన్‌డీ-1లతో కూడిన ఎన్డీయే కూటమికి మొత్తం 128 మంది ఎమ్మెల్యేల బలమున్నట్టు సమాచారం. మహాగట్‌బంధన్‌ పేరుతో ఒక్కటైన ఆర్జేడీ-79, కాంగ్రెస్‌-19, సీపీఐ(ఎంఎల్‌)-12, సీపీఎం-2, సీపీఐ-2, ఇతరులు-1, ఏఐఎంఐఎం-1..కూటమికి 114 మంది ఎమ్మెల్యేల మద్దతుంది. కాగా

మ్యాజిక్ ఫిగర్ దాటి ఎన్డీఏకు బలం చేకూరింది.




Updated : 12 Feb 2024 9:06 AM IST
Tags:    
Next Story
Share it
Top