Home > జాతీయం > నేడు రైతు సంఘాల బ్లాక్ డే

నేడు రైతు సంఘాల బ్లాక్ డే

నేడు రైతు సంఘాల బ్లాక్ డే
X

దేశరాజధాని ఢిల్లీలో రైతుల ఆందోళనలు కొనసాగుతున్నాయి. పంటలకు కనీస మద్దతూ ధర ఇవ్వాలని పంజాబ్, హర్యానా రైతులు ఢిల్లీ చలో కార్యక్రమం చేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ఢిల్లీ సరిహద్దుల్లో నిరసన తెలుపుతూ పోలీసుల కాల్పుల్లో రైతు మృతి చెందిన ఘటనపై మర్డర్ కేసు నమోదు చేయాలని సంయుక్త కిసాన్ మోర్చా (ఎస్ కేఎమ్) డిమాండ్ చేసింది. రైతు మృతి కేసులో హరియాణా సీఎం మనోహర్‌లాల్‌ ఖట్టర్‌, హోంశాఖ మంత్రి అనిల్‌ విజ్‌లపై మర్డర్ కేసు నమోదు చేయాలని తెలిపింది. పంజాబ్‌‌ సంగ్రూర్ జిల్లాలోని ఖనౌరీ సరిహద్దుల్లో పోలీసులు, రైతుల మధ్య ఘర్షణలు చెలరేగాయి. ఈ ఆందోళనల్లో శుభకరణ్ సింగ్ అనే యువ రైతు చనిపోగా, 12 మంది రైతులు గాయపడ్డారు. రైతు మృతిని ఎస్ కేఎమ్ తీవ్రంగా ఖండించింది. చనిపోయిన రైతు కుటుంబానికి కోటి రూపాయల నష్ట పరిహారం ఇవ్వాలని డిమాండ్ చేసింది. ఢిల్లీ చలో మార్చ్ లో భాగంగా శంభు, ఖనౌరీ బార్డర్ లో వేలాది మంది రైతులు ఆందోళనలు చేస్తూ క్యాంపులు ఏర్పాటు చేశారు.

ఈ నేపథ్యంలో నేడు బ్లాక్ డేగా పాటించాలని ఎస్ కేఎమ్ పిలుపునిచ్చింది. అందులో భాగంగా కేంద్ర హోం మంత్రి అమిత్ షా, హర్యానా మంత్రి అనిల్ విజ్ దిష్టిబొమ్మలను దహనం చేస్తామని స్పష్టం చేసింది. అంతేగాక ఫిబ్రవరి 26న దేశవ్యాప్తంగా హైవేలపై రైతులు ట్రాక్టర్ మార్చ్ లు నిర్వహిస్తారని తెలిపింది. ఇటు ఢిల్లీలో మార్చి 14న మహాపంచాయత్ ను చేపడుతారని చెప్పింది. ఎంఎస్పీకి చట్టబద్ధత, రైతులపై కేసుల ఎత్తివేత, ఇతర డిమాండ్లతో రైతులు చేపట్టిన ఢిల్లీ చలో మార్చ్ కు ఎస్ కేఎమ్, కిసాన్ మజ్దూర్ సంఘ్ నాయకత్వం వహిస్తున్నాయి.

Updated : 23 Feb 2024 7:42 AM IST
Tags:    
Next Story
Share it
Top