Home > జాతీయం > CM Champai Soren : చంపయి సర్కార్కు నేడు బలపరీక్ష...మెజార్టీ ఎవరిది?

CM Champai Soren : చంపయి సర్కార్కు నేడు బలపరీక్ష...మెజార్టీ ఎవరిది?

CM Champai Soren : చంపయి సర్కార్కు నేడు బలపరీక్ష...మెజార్టీ ఎవరిది?
X

జార్ఖండ్ సీఎం చంపై సోరెన్ నేడు బల పరీక్షను ఎదుర్కోనున్నారు. జార్ఖండ్‌ మాజీ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ అరెస్టు నేపథ్యంలో అధికార జేఎమ్‌ఎమ్ పార్టీకి అసెంబ్లీలో బలపరీక్ష ఎదుర్కోనుంది. ఇప్పటికే భూ కుంభకోణం కేసులో హేమంత్ సోరెన్ అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత సీఎంగా చంపై సోరెన్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఈ నేపథ్యంలో రాజకీయ సంక్షోభంతో హైదరాబాద్ చేరుకున్న జేఎమ్ఎమ్ పార్టీ ఎమ్మెల్యేలు బలపరీక్ష కోసం రాంచీకి వెళ్లారు. అయితే, అధికార పార్టీకి అత్యధిక మెజారిటీ ఉండడంతో వార్ వన్ సైడ్ అయ్యేలా కనిపిస్తోంది. అలా కాకుండా ఏమైనా జరిగి అధికార పార్టీ ఎమ్మెల్యేలు అడ్డం తిరిగితే సీన్ రివర్స్ కూడా అవ్వొచ్చని రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు.

జార్ఖండ్లో మొత్తం 81 అసెంబ్లీ స్థానాలున్నాయి. అందులో ప్రస్తుతం జేఎంఎంకు 28 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. కాంగ్రెస్కు 16, ఎన్సీపీ, ఆర్జేడీ, సీపీఐఎంల్కు చెరొక ఎమ్మెల్యే చొప్పున ఉన్నారు. ఇక బీజేపీ, దాని మిత్రపక్షాలకు కలిపి 29 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు. దీంతో మేజిక్ ఫిగర్ 41గా ఉంది. అయితే మనీలాండరింగ్ స్కామ్ లో హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడంతో జార్ఖండ్లో రాజకీయం హీటెక్కింది. బలపరీక్ష ఎదుర్కోవడం జేఎమ్ఎమ్‌కు ఇదేం తొలిసారి కాదు. 2022 సెప్టెంబర్‌లో జరిగిన బలపరీక్షలో 48 ఎమ్మెల్యేల మద్దతుతో జేఎమ్ఎమ్ అధికారం దక్కించుకుంది. గతంలో కూడా హేమంత్ సోరెన్ అవినీతి ఆరోపణలు ఎదుర్కొని బలపరీక్షను ఎదుర్కొన్నారు.

ప్రస్తుత ముఖ్యమంత్రి చంపై సోరెన్‌ 90ల్లో ప్రత్యేక ఝార్ఖండ్ రాష్ట్ర సాధన కోసం ఆయన శిబూ సోరెన్‌తో కలిసి ఉద్యమించారు. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలో రవాణా శాఖమంత్రిగా పనిచేశారు. మరోవైపు ఈ బలపరీక్షలో మాజీ సీఎం హేమంత్ సోరెన్ ఓటు హక్కు వినియోగించుకోనున్నారు. బలపరీక్షకు హజరయ్యేందుకు అనుమతించాలంటూ రాంచీ కోర్టులో ఆయన పిటిషన్ దాఖలు చేయగా.. న్యాయస్థానం అనుమతించింది. రూ.600 కోట్లకు సంబంధించిన భూ కుంభకోణం కేసులో మనీలాండరింగ్‌ ఆరోపణలు ఎదుర్కొంటున్న హేమంత్‌ సోరెన్‌ను ఈడీ అరెస్టు చేసింది. పీఎంఎల్‌ఏ కోర్టులో ప్రవేశపెట్టగా న్యాయస్థానం ఆయనకు 5 రోజుల ఈడీ కస్టడీ విధించింది. దీంతో ప్రస్తుతం ఆయన రాంచీ జైలులో ఉన్నారు.

Updated : 5 Feb 2024 7:29 AM IST
Tags:    
Next Story
Share it
Top