Home > జాతీయం > Gold price:చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. కొనాలంటేనే భయపడిపోతున్న మహిళలు

Gold price:చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు.. కొనాలంటేనే భయపడిపోతున్న మహిళలు

Gold price:చుక్కలు చూపిస్తున్న బంగారం ధరలు..  కొనాలంటేనే భయపడిపోతున్న మహిళలు
X

బంగారం ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ప్రతి రోజూ ధరలు పెరుగుతూ కొనుగోలుదారులను ఆందోళనకు గురి చేస్తున్నాయి. వరసగా ధరలు పెరుగుతుండటంతో కొనుగోలుదారులు కూడా అసలు బంగారం కొనాలా? వద్దా? అనే సందిగ్దంలో పడ్డారు. ఇక పెళ్లిళ్లు, ఫంక్షన్లు వంటి శుభకార్యాలకు కచ్చితంగా బంగారం అవసరం కాబట్టి.. రేటు ఎక్కువైనా తప్పనిసరి పరిస్థితుల్లో కొంటున్నారు కొందరు. బంగారం ధరలు పెరుగుతూ ఉన్నా.. కొనుగోళ్లు మాత్రం తగ్గడం లేదని వ్యాపారులు చెబుతున్నారు. తమ వ్యాపారం సజావుగానే జరుగుతుందని వ్యాపారులు చెబుతున్నారు. అంతర్జాతీయ మార్కెట్ లో ధరల పెరుగుదల కారణంగా బంగారం ధరలు మరింత ప్రియంగా మారిపోయాయి. బంగారం ధరలు ఎవరికీ అందనంత దూరంలో ఉండిపోవడంతో కొనుగోలు చేయాల్సిన వారు కూడా ఎక్కువ మొత్తంలో కాకుండా మమ అనిపించేస్తూ శుభకార్యాల తంతు ముగించేస్తున్నారు.

దేశంలో శుక్రవారం కూడా బంగారం ధరలు పెరిగాయి. 10గ్రాముల పసిడి(22క్యారెట్లు) ధర రూ. 400 పెరిగి.. రూ. 58,900కి చేరింది. గురువారం రూ. 58,500గా ఉన్న బంగారం ధర.. ఓకే రోజులో రూ.400 పెరిగింది. మరోవైపు 24 క్యారెట్ల బంగారం(10గ్రాములు) ధర రూ. 430 పెరిగి... రూ. 64,250కి చేరింది. తెలుగు రాష్ట్రాల్లోని హైదరాబాద్​, విజయవాడ, విశాఖపట్నంలో కూడా ధరలు ఈ విధంగానే ఉన్నాయి. దేశంలోని కీలక ప్రాంతాల్లో సైతం బంగారం రేట్లు శుక్రవారం పెరిగాయి. దేశ రాజధాని ఢిల్లీలో 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,400గాను.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 54,980గా ఉంది. కోల్​కతాలో ప్రస్తుతం 22 క్యారెట్ల పసిడి ధర రూ. 50,250 పలుకుతోంది. 24 క్యారెట్ల గోల్డ్​.. 54,820గా ఉంది. ముంబై, బెంగళూరు, కేరళలోనూ ఇవే రేట్లు కొనసాగుతున్నాయి. వెండి ధరలు కూడా ఈ రోజు పెరిగాయి. ప్రస్తుతం.. 100 గ్రాముల వెండి ధర రూ. 7,950గా ఉంది. ఇక కేజీ వెండి ధర రూ. 300 వృద్ధిచెంది రూ. 79,500గా కొనసాగుతోంది. క్రితం రోజు ఈ ధర రూ. 79,200గా ఉండేది. కాగా.. హైదరాబాద్​లో కేజీ వెండి ధర రూ. 81,000 పలుకుతోంది.

Updated : 29 Dec 2023 9:51 AM IST
Tags:    
Next Story
Share it
Top