Gold Price : దీపావళి పండుగ వేళ భారీగా తగ్గిన బంగారం ధరలు
X
దీపావళి పండుగ వేళ బంగారం కొనుగోలు చేయాలనుకుంటున్నారా.. మీకిదే మంచి అవకాశం. నిన్న కాస్త పెరిగిన ధరలు ఈరోజు భారీగా తగ్గాయి. ఆదివారం (నవంబర్ 12) ఉదయం వరకు నమోదైన ధరలను చూస్తే... 22 క్యారెట్ల పది గ్రాముల బంగారం ధర రూ.55,550 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల ధర రూ.60,630 లుగా ఉంది. 22 క్యారెట్ల బంగారంపై రూ.450, 24 క్యారెట్లపై 490 మేర ధర తగ్గింది. వెండి కిలో ధర రూ.1000 మేర తగ్గి.. 73,000 లుగా కొనసాగుతోంది
దేశంలోని మిగతా ప్రధాన నగరాల్లో ధరలను పరిశీలిస్తే.. ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ.55,700 ఉంటే.. 24 క్యారెట్ల ధర రూ.60,750 గా ఉంది. వెండి కిలో ధర రూ.73,000 గా ఉంది. ముంబైలో 22 క్యారెట్ల బంగారం రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,600, కోల్‌కతాలో 22 క్యారెట్ల ధర రూ.55,550, 24 క్యారెట్లు రూ.60,630, చెన్నైలో 22 క్యారెట్ల ధర రూ.56,000, 24 క్యారెట్ల ధర రూ.60,600, బెంగళూరులో 22 క్యారెట్ల బంగారం ధర రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,630, కేరళలో 22 క్యారెట్ల ధర రూ.55,550, 24 క్యారెట్ల ధర రూ.60,630 గా ఉంది.
వెండి ధరలు
ఢిల్లీ, ముంబైలో వెండి కిలో ధర రూ.73,000 గా ఉండగా.. చెన్నైలో రూ.76,000, బెంగళూరులో రూ.72,750 ఉంది. కేరళలో రూ.76,000, కోల్‌కతాలో రూ.73,000 లుగా ఉంది. హైదరాబాద్‌లో వెండి కిలో ధర రూ.76,000, విజయవాడలో రూ.76,000, విశాఖపట్నంలో కిలో వెండి ధర రూ.76,000 లుగా ఉంది.