Gold and Silver Prices Today : పసిడి ప్రియులకు స్వల్ప ఊరట.. తెలుగు రాష్ట్రాల్లో నేటి ధరలు
X
దీపావళి పండుగను పురస్కరించికుని బంగారం కొనుగోలు చేయాలనుకునే వారికి ఇదే మంచి అవకాశం. రెండు రోజులుగా పెరిగిన బంగారం ధరలు నిన్న కాస్త స్వల్పంగా తగ్గాయి. నేడు స్థిరంగా ఉన్నాయి. ముందు ముందు మళ్లీ ధరలు పెరిగే అవకాశం ఉన్నట్లుగా మార్కెట్ నిపుణులు భావిస్తున్నారు. అంతర్జాతీయ బులియన్ మార్కెట్లో గోల్డ్ రేట్లు వరుస పెట్టి పెరుగుతున్న క్రమంలో ఆ ప్రభావం మన దేశీయ మార్కెట్లపై పడుతోంది. అలాగే పండుగ సీజన్‌లో గిరాకీ పెరగడమూ ధరల పెరుగుదలకు కారణంగా చెప్పవచ్చు. గత వారం రోజుల్లో భారీగా పెరిగిన బంగారం ధర సరికొత్త గరిష్ఠాలకు చేరిన సంగతి తెలిసింది. అయితే, మధ్య మధ్యలో కాస్త దిగివస్తు పసిడి ప్రియులకు ఊరట కలిగిస్తోంది. హైదరాబాద్ బులియన్ మార్కెట్‌లో సోమవారం (నవంబర్ 6) 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,500 ఉండగా.. 24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 61,640గా ఉంది. ఈ పసిడి ధరలు దేశీయ మార్కెట్లో నేటి ఉదయం నమోదైనవి. గుడ్‌రిటర్న్స్ వెబ్‌సైట్ ప్రకారం.. దేశంలోని ప్రధాన నగరాల్లో నేటి బంగారం ధరలు ఎలా ఉన్నాయో తెలుసుకుందాం.
ఢిల్లీలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 56,650లుగా ఉండగా.. 24 క్యారెట్ల బంగారం ధర రూ. 61,790గా ఉంది. చెన్నైలో 22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 57,150లు ఉండగా.. 24 క్యారెట్ల పసిడి ధర రూ. 62,350గా నమోదైంది. ముంబై, బెంగళూరు, కేరళ, హైదరాబాద్, వరంగల్, విజయవాడ, విశాఖపట్నంలో 22 క్యారెట్ల 10 గ్రాముల పసిడి ధర రూ. 56,500 ఉండగా.. 24 క్యారెట్ల ధర రూ. 61,640గా కొనసాగుతోంది.
వెండి ధరలు
ప్రస్తుతం కిలో వెండి ధర ఢిల్లీలో రూ. 900 పెరిగి ప్రస్తుతం రూ. 75 వేల మార్క్‌ను తాకింది. ఇక ఢిల్లీ మార్కెట్లో బంగారం ధరలు కాస్త తగ్గి ఊరట కలిగించాయి. ఇవాళ 22 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 100 తగ్గి ప్రస్తుతం రూ. 56 వేల 650కి చేరింది. ఇక 24 క్యారెట్ల గోల్డ్ రేటు 10 గ్రాములకు రూ. 110 తగ్గి ప్రస్తుతం రూ. 61 వేల 790 వద్దకు దిగివచ్చింది.