Home > జాతీయం > రోడ్డుపై ట్రాఫిక్ జాం.. ఈ వాహనదారుడు చేసిన పనికి అంతా అవాక్కు..

రోడ్డుపై ట్రాఫిక్ జాం.. ఈ వాహనదారుడు చేసిన పనికి అంతా అవాక్కు..

రోడ్డుపై ట్రాఫిక్ జాం.. ఈ వాహనదారుడు చేసిన పనికి అంతా అవాక్కు..
X

లాంగ్ వీకెండ్.. పైగా క్రిస్మస్ హాలిడే.. ఇక ఎవరు ఊరుకుంటారు. మంచు కొండలపై, స్నో పడుతుంటే.. పండగను జరుపుకోవాలని ఎవరికుండదు. అందుకే దేశంలోనే అందమైన ప్రదేశం, హాట్ ఫేవరెట్ టూరిస్ట్ స్పాట్ షిమ్లాకు జనాలు క్యూ కట్టారు. వందల్లో కాదు.. వేలల్లోనే ఈ ప్రాంతానికి తరలివచ్చారు. గత మూడు రోజుల్లో 55 వేల వాహనాలు షిమ్లాకు వచ్చినట్లు అధికారులు తెలిపారు. దీంతో షిమ్లా, మనాలి, కసోల్ ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. షిమ్లా డైరెక్టర్ జనరల్ సంజయ్ కుండు తెలిపిన వివరాల ప్రకారం.. అటల్ టన్నెల్ ద్వారా షిమ్లా, మనాలికి గత మూడు రోజుల్లో 55వేల వాహనాలు ప్రవేశించాయట. దాదాపు 12వేల వాహనాలు ఇంకా.. ఆ టన్నెల్ బయటే ఉన్నాయట.

పెద్ద ఎత్తున ట్రాఫిక్ జాం అవ్వడంతో ఓ వ్యక్తి కొత్తగా ఆలోచించి పోలీసులతో ఫైన్ వేయించుకున్నాడు. ఓ వ్యక్తి భారీ ట్రాఫిక్ను తప్పించుకునేందుకు నదిలోంచి వాహనాన్ని పోనిచ్చాడు. లాహుల్ వ్యాలీలోని చంద్రానదిలో మహీంద్రా థార్ ప్రయాణిస్తున్న వీడియో నెట్టింట్లో వైరల్‌గా మారింది. ఘటన సమయంలో నదిలో నీరుపెద్దగా లేకపోవడంతో ఎటువంటి ప్రమాదం జరగలేదు. అయితే డ్రైవర్ నిర్లక్ష్యంపై స్థానికులు విమర్శలు గుప్పించారు. ఈ తతంగం పోలిసుల వరకు చేరడంతో వారు చర్యలు తీసుకున్నారు. వాహనానికి చలాన్ విధించడంతో పాటు భవిష్యత్లో ఇలాంటి ఘటనలు జరగకుండా తగిన చర్యలు తీసుకుంటామని చెప్పారు.

Updated : 26 Dec 2023 1:50 PM IST
Tags:    
Next Story
Share it
Top