విషాదాన్ని నింపిన విహార యాత్ర..సముద్రంలో పడి నవ దంపతుల మృతి
Lenin | 12 Jun 2023 9:05 AM IST
X
X
హనీమూన్ ట్రిప్ కోసం ఇండోనేషియా వెళ్లిన నవ దంపతులు ప్రమాదవశాత్తు అక్కడి సముద్రంలో పడి మరణించారు. తమిళనాడులోని తిరువళ్ళూరు జిల్లా పూనమల్లి సమీపంలోనసెన్నీర్కుప్పానికి చెందిన డాక్టర్ విభూషిణియాకు చెన్నైకి చెందిన డాక్టర్ లోకేశ్వరన్‌తో ఈ మధ్యనే పెళ్లైంది. ఇండోనేషియాలో హనీమూన్ ప్లాన్ చేశారు. జూన్ 9న అక్కడి అందమైన ప్రాంతాలను చుట్టేసి సముద్రంలో బోటు షికారు చేశారు. మార్గమధ్యలో హటాత్తుగా బోటు సముద్రంలో బోల్తాపడింది. దీంతో ఇద్దరూ సముద్రంలో పడిపోయి చనిపోయారు. ఆ రోజే లోకేష్వరన్ డెడ్ బాడీని పోలీసులు బయటకు తీశారు. తాజాగా శనివారం విభూషిణియా మృతదేహం లభించింది. ఈ రెండు మృతదేహాలను చెన్నై తీసుకువచ్చేందుకు రాష్ట్ర సర్కార్ ఏర్పాట్లు చేస్తోంది. నూతన వధూవరులు విగత జీవులుగా మారడంతో వారి కుటుంబాలు శోకసంద్రంలో మునిగిపోయాయి.
Updated : 12 Jun 2023 9:05 AM IST
Tags: tragedy honeymoon trip newly married couple accidentally fell into sea Indonesia lost their life tamilnadu
Next Story
© 2017 - 2018 Copyright Mictv news. All Rights reserved.
Designed by Hocalwire