Train Incident: ప్లాట్‌ఫాంపైకి దూసుకొచ్చిన రైలు.. అదృష్టం బాగుండి బతికిపోయారు.. వీడియో
X
బ్రేకులు ఫెయిల్ అవడతో నేరుగా ప్లాట్‌ఫాంపైకి ఒక్కసారిగా దూసుకొచ్చింది ఓ రైలు. అదృష్టవశాత్తూ ఆ రైలు ఇంజన్ పిల్లర్‌ను ఢీకొని ఆగిపోయింది. లేకుంటే ప్లాట్‌ఫాంపై రైలు కోసం ఎదురుచూస్తున్న ప్రయాణికుల మీదకి వచ్చినట్లయితే ఘోర ప్రమాదం జరిగిఉండేది. ఉత్తర్‌ప్రదేశ్‌లోని మథుర రైల్వేస్టేషన్లో ఈ ఘటన జరిగింది. రైలు పిల్లర్ ని ఢీకొని అక్కడే ఆగిపోవడంతో ఎలాంటి ప్రాణనష్టం జరగలేదని రైల్వే అధికారులు వెల్లడించారు. అధికారులు వెల్లడించిన వివరాల ప్రకారం.. శుకర్ బస్తీ స్టేషన్ నుంచి వచ్చిన ఈఎంయూ ప్యాసింజర్ రైలు.. ఢిల్లీకి వెళ్లాల్సి ఉంది. అయితే బయల్దేరే సమయంలో అకస్మాత్తుగా రైలు బ్రేకులు ఫెయిలయ్యాయి. రైలు ఇంజన్ ట్రాక్‌పై ఉన్న స్లీపర్‌ను బద్దలు కొట్టి ప్లాట్‌ఫారమ్ నంబర్ 2 పైకి ఎక్కి భారీ ఇనుప స్తంభాన్ని ఢీకొట్టి ఆగిపోయింది.
ప్రమాదం గురించి విషయం తెలిసిన వెంటనే రైల్వే అధికారులు ఘటనాస్థలికి చేరుకున్నారు. రైల్వే అధికారి అక్కడికక్కడే విచారణకు ఆదేశాలు జారీ చేశారు. ప్రమాదంలో ఎలాంటి ప్రాణనష్టం జరగకపోవడం వల్ల అంతా ఊపిరిపీల్చుకున్నారు. ఈ ఘటన వల్ల పలు రైళ్ల రాక ఆలస్యమైందని అధికారులు చెప్పారు. ప్రమాదం అనంతరం ప్రయాణికులంతా.. రైల్వే కంపార్ట్మెంట్లో కాసేపు సేదతీరారు. పెను ప్రమాదం తప్పిందని తెలిపారు.
#WATCH | Uttar Pradesh: An EMU train coming from Shakur Basti derailed and climbed the platform at Mathura Junction. (26.09) pic.twitter.com/ZrEogmvruf
— ANI (@ANI) September 26, 2023