దొంగతనం చేయబోయి.. చేతికి భలే చిక్కాడు
X
కదులుతున్న రైల్లో దొంగతనం చేయబోయి పట్టుబడ్డాడో దొంగ. తన ప్రాణానికి ప్రమాదమని రైలు నుంచి దూకబోయాడు. కానీ ఇంతలోనే రైలు కదిలింది. బయటకు దూకలేక.. లోపల ప్రయాణికులకు చిక్కితే చితక్కొడతారనే అయోమయంలో కంపార్ట్‌మెంట్ కిటికి పట్టుకొని బయటివైపు వేలాడాడు. ప్రయాణికులు కూడా వేలాడుతున్న ఆ దొంగని చూసి జారిపడితే ప్రాణాలు పోతాయన్న భయంతో అతడిని అలాగే లోపలి నుంచి చేతులు పట్టుకున్నారు. అతడి చేతులు పట్టుకోవడంతో కొన్ని కిలోమీటర్ల వరకు రైలు కంపార్ట్ మెంట్ కిటీకి బయటవైపు ప్రమాదకరంగా వేలాడాడు. ఈ ఘటన బిహార్ లోని బెగూసరాయ్ లొ జరిగింది.
కటిహార్ నుంచి సమస్తిపుర్ వెళ్తున్న రైలులో (Train) ఓ మహిళ పర్సును ఓ దొంగ చోరీ చేశాడు. అయితే, కిటికీ ఊచలు పట్టుకొని వేలాడుతూ దూకేందుకు ప్రయత్నిస్తున్న దొంగను మిగతా ప్రయాణికులు గుర్తించారు. వెంటనే లోపల్నుంచి ఆ యువకుడి చేతులు గట్టిగా పట్టుకోవడంతో కొన్ని కిలోమీటర్ల వరకూ అతడే అలాగే ప్రయాణించాడు. ప్రయాణికులు అతడిని గట్టిగా పట్టుకునే ప్రయత్నం చేశారు. తరువాతి స్టేషన్ వచ్చేవరకూ ఆ దొంగ కంపార్ట్‌మెంట్ కిటికీ బయటవైపు అలాగే ప్రమాదకరంగా వేలాడుతూ ప్రయాణించాడు. బచ్వారా జంక్షనులో రైలు ఆగాక అతడిని ప్రయాణికులు పట్టుకొని.. ఆర్‌పీఎఫ్ కానిస్టేబుల్‌కు అప్పగించారు. రైలు కిటికీకి దొంగ వేలాడుతున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది.