ఇదెక్కడి విచిత్రం రా నాయనా...ఇదెప్పుడూ చూడలా
X
భారతదేశంలో చాలాచోట్ల ఊర్లు, రోడ్ల మధ్యలో నుంచి రైల్వే ట్రాక్ లు ఉంటాయి. ట్రైన్స్ వచ్చినప్పుడు గేట్లు వేసేయడం, ఆ రోడ్డు మీద వెళుతున్న వాహనాలను ఆపేయడం అందరికీ తెలిసి విషయమే. ఏది ఏమైనా రైలుకే ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇస్తారు. అది వెళ్ళాకనే కార్లు, బైకులు ఇంకా ఏ ఇతర పెద్ద వాహనాలైనా వెళ్ళాల్సిందే. కానీ ఉత్తరప్రదేశ్ లో మాత్రం సీన్ రివర్స్ అయింది. రైలు ట్రాఫిక్ జామ్ లో ఇరుక్కుపోయింది.
బనారస్ లో ఓ రైల్వే క్రాసింగ్ దగ్గర జరిగిందీ ఘటన. ఆ ట్రాక్ మీద రైలు రాక ముందు భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ట్రైన్ వచ్చే టైమ్ అయినా కూడా క్లియర్ అవలేదు. దీంతో క్రాసింగ్ కు కొంతదూరంలోనే ట్రైన్ ను ఆపేయాల్సి వచ్చింది. ట్రాఫిక్ పోలీసులు రంగంలోకి దిగి ట్రాఫిక్ను క్లియర్ చేసేందుకు ప్రయత్నించారు. మరో వైపు రైలులో ఉన్న లోకో పైలట్ త్వరగా వెళ్ళలాని హారన్ మోగిస్తూనే ఉన్నాడు. అయినా కూడా వాహనదారులు అవేమీ పట్టించుకోలేదు. తాము వెళ్ళడమే ముఖ్యం అన్నట్టు ఆగకుండా అటూ ఇటూ వెళుతూనే ఉన్నారు.
ఈ మొత్తం వ్యవహారాన్ని అక్కడే పక్కన ఉన్న ఓ వ్యక్తి వీడియో తీసి సోషల్ మీడియాలో పెట్టారు. ఇప్పుడు ఆ వీడియో బాగా వైరల్ అవుతోంది. దీని మీద యూజర్లు ఫన్నీగా స్పందిస్తున్నారు. కేవలం మన దేశంలో మాత్రమే ఇలాంటి సంఘటనలు జరుగుతాయంటూ కామెంట్లు పెడుతున్నారు. అయితే ఎంతసేపు ఇలా రైలు ఆగిపోయింది. ట్రాఫిక్ ఎప్పుడు క్లియర్ అయిందనేది మాత్రం వివరాలు తెలియలేదు.
India is not for the beginners 🤣😂 pic.twitter.com/sSFLZWS3BK
— BALA (@erbmjha) August 13, 2023