Home > జాతీయం > ఘోర ప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి 15 మంది మృతి

ఘోర ప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి 15 మంది మృతి

ఘోర ప్రమాదం.. ట్రాన్స్‌ఫార్మర్‌ పేలి 15 మంది మృతి
X

ఉత్త‌రాఖండ్‌లో ఘోర ప్రమాదం జరిగింది. చ‌మోలీ జిల్లాలో కరెంట్ ట్రాన్స్‌ఫార్మ‌ర్ పేలి.. 15 మంది మృతిచెందగా.. పలువురు గాయపడ్డారు. క్షతగాత్రులను జిల్లా ఆస్పత్రికి తరలించి చికిత్స అందిస్తున్నారు. అల‌క‌నంద న‌దీ స‌మీపంలో ఈ ప్రమాదం జరిగింది. మృతుల్లో పోలీసులు పలువురు పోలీసులు కూడా ఉన్నారు.

ప్రమాదం జరిగిన ప్రాంతంలో నమామి గంగే ప్రాజెక్ట్‌ పనులు నడుస్తున్నట్లు తెలుస్తోంది. ట్రాన్స్‌ఫార్మర్ పేలిపోవడం వల్ల వంతెన రెయిలింగ్‌కు విద్యుత్ ప్రవహించి ఉంటుందని అధికారులు అంచనా వేస్తున్నారు. ‘‘ఈ ప్రమాదంలో 15 మంది మృతి చెందారు. వారిలో ఎస్సై, హోం గార్డులు ఉన్నారు. ప్రస్తుతం దీనిపై దర్యాప్తు జరుగుతోంది. రెయిలింగ్‌కు విద్యుత్ ప్రవాహం జరగడం వల్లే ఈ ప్రమాదం జరిగి ఉండొచ్చని భావిస్తున్నాం’’ అని ఉత్తరాఖండ్‌ ఏడీజీపీ మురుగేశన్ తెలిపారు. ఘటనాస్థలాన్ని ఉత్తరాఖండ్‌ సీఎం పుష్కర్‌ సింగ్‌ ధామి పరిశీలించనున్నారు.

Updated : 19 July 2023 2:06 PM IST
Tags:    
Next Story
Share it
Top