Home > జాతీయం > శబరిమల ఆలయాన్ని దర్శించి చరిత్ర సృష్టించిన ట్రాన్స్జెండర్

శబరిమల ఆలయాన్ని దర్శించి చరిత్ర సృష్టించిన ట్రాన్స్జెండర్

శబరిమల ఆలయాన్ని దర్శించి చరిత్ర సృష్టించిన ట్రాన్స్జెండర్
X

ట్రాన్స్జెండర్ నిషా చరిత్ర సృష్టించింది. శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్న తొలి తెలుగు ట్రాన్స్ జెండర్ గా జోగిని నిషా రికార్డ్ నెలకొల్పింది. నల్గొండ జిల్లా నార్కట్ పల్లి మండలంలోని చెర్వుగట్టు శ్రీ పార్వతి జడల రామలింగేశ్వరస్వామి దేవాలయంలో జరిగే బ్రహోత్సవాలకు, ప్రతి అమావాస్యకు వచ్చే జోగిని నిషా క్రాంతి.. ఆదివారం శబరిమల అయ్యప్ప స్వామిని దర్శించుకున్నారు.

ట్రాన్స్ జెండర్ ఐడీ ఆధారంగా కేరళ ప్రభుత్వం నిషాకు ఆలయంలోనికి అనుమతిచ్చింది. కేరళ ప్రభుత్వం అనుమతి ఇవ్వడంతో శబరిమల ఆలయాన్ని దర్శించున్న జోగిని నిషా.. శబరిమల ఆలయాన్ని దర్శించుకున్న తొలి తెలుగు ట్రాన్స్ జెండర్‌గా చరిత్ర సృష్టించారు. ఈ సందర్భంగా మాట్లాడిన నిషా.. కేరళ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపింది. తనను ఆలయంలోనికి ప్రవేశించినందుకు సంతోషం వ్యక్తం చేసింది. ఇది ఒక శుభ పరిణామమని, తాను కూడా అందరిలాగే శబరిమల కొండ ఎక్కి అయ్యప్పను దర్శించుకోవడంతో తన జన్మ ధన్యం అయిందని చెప్పుకొచ్చింది.

Updated : 1 Jan 2024 3:08 PM IST
Tags:    
Next Story
Share it
Top