ట్రెక్కింగ్కు వెళ్తే గుంజీలు తీయించారు
X
దేశంలో సుందరమైన జలపాతం ఏదంటే.. చాలామంది టక్కున చెప్పే పేరు దూద్ సాగర్ వాటర్ ఫాల్స్. ఎత్తైన కొండలు, అడవి, మధ్యలో రైల్వే ట్రాక్.. చూస్తుంటే ప్రకృతి అందం మొత్తం ఈ స్థలంలోనే ఉండిపోయినట్లు కనిపిస్తుంది. ఏటా లక్షల మంది ఈ ప్లేస్ ను చూడ్డానికి వెళ్తుంటారు. అక్కడికి వెళ్లడానికి ప్ల్రైవ్ ట్రావెల్స్ అందుబాటులో ఉన్నా.. చాలామంది ట్రైన్ రూట్ నే ఎంచుకుంటారు. ఎందుకంటే.. అంత అందంగా ఉంటుంది ఆ జర్నీ. అయితే, ఈ జర్నీలో కొన్ని రిస్ట్రిక్షన్స్ ఉన్నాయి. రైల్వే స్టేషన్ కంటే ముందే ట్రైన్ లో నుంచి దిగడం, పట్టాల పై నుంచి నడుస్తూ ఇబ్బంది కల్గించడాన్ని చట్ట రీత్య నేరంగా పరిగణిస్తారు. అయితే, అలా రూల్స్ ను అతిక్రమించిన పర్యటకులను.. పోలీసులు తగిన బుద్ది చెప్పారు.
దూద్ సాగర్ వాటర్ ఫాల్స్ ను చూడ్డానికి వెళ్లిన పర్యాటకులను అడ్డుకున్న రైల్వే పోలీసులు వాళ్లతో గుంజీలు తీయించారు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. రైల్వేశాఖ ఇటీవల ఆంక్షలు విధించారు. రైలు పట్టాలపై నడిస్తే చట్ట ప్రకారం చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అయినా పట్టించుకోని కొంతమంది ట్రెక్కర్స్ రూల్స్ అతిక్రమించి పట్టాలు దాటారు. దీంతో రైల్వే అధికారులు పనిష్మెంట్ కింద వారిని గుంజీలు తీయించారు.
Railway Police Punish Trekkers at Dudhsagar Waterfall. #Dudhsagar #travel pic.twitter.com/hM94awOmcy
— Naveen Navi (@IamNavinaveen) July 16, 2023