విదేశీ అతిథులకు..స్వదేశీ మహిళల పాఠాలు
X
దేశ రాజధాని ఢిల్లీలో జరుగుతున్న జీ20 సదస్సు కోసం ప్రపంచ దేశాల నేతలు ఒకరొకరే వచ్చేస్తున్నారు. అటు అమెరికా నుంచి ఇటు ఆసియా వరకు 19 దేశాల అగ్రనేతలు, మంత్రులు, ఉన్నత స్థాయి అధికారులు ప్రత్యేక విమానాల్లో భారత్లో ల్యాండ్ అవుతున్నారు.
బ్రిటిష్ ప్రధానమంత్రిగా పదవి చేపట్టిన తొలి భారత సంతతి నేత రుషి సునక్ ఇప్పటికే ఢిల్లీ చేరుకున్నారు. భార్య అక్షతా మూర్తితో కలసి భారత్కు వచ్చారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ సాయంత్రం ఏడు గంటలకు హస్తిన చేరుకోనున్నారు. ప్రధాని మోదీ అధ్యక్షతన జరిగే సదస్సులో వాతావరణ మార్పుల నిరోధకం, రష్యా-ఉక్రెయిన్ యుద్ధం, పేదరిక నిర్మూలన వంటి అంశాలపై ఎప్పట్లాగే చర్చలు జరిపి తీర్మానాలు చేయనున్నారు. అదే క్రమంలో ఈ సదస్సులో ఓ చారిత్రాత్మక ఘట్టం జరగనుంది. విదేశీ అతిథులకు స్వదేశీ మహిళల పాఠాలు చెప్పనున్నారు. చిరుధాన్యాల సాగు గురించిన ఆవశ్యకతను ఈ దస్సులో వివరించేందుకు ఒడిశాకు చెందిన గిరిజన మహిళలకు అవకాశాన్ని కల్పించింది కేంద్రం.
ఒడిశాలోని భూమియా సామాజిక వర్గానికి చెందిన 36 ఏళ్ల రైమతి ఘురియా, మయూర్‌భంజ్ జిల్లా మతియాగర్ గ్రామానికి చెందిన 45 ఏళ్ల రైతు సుబాసా మొహంతాలకు ఈ అరుదైన గౌరవం దక్కింది. సెప్టెంబర్ 9, 10 తేదీల్లో జరిగే సమావేశాలకు వీరికి కేంద్రం నుంచి ఆహ్వానం అందింది. సేద్యంలో అపార అనుభవం ఉన్న రైమతి ఇప్పటి వరకు 72 కంటే ఎక్కువ దేశీయ రకాల వరిని సాగు చేశారు. ఆమె 30 కంటే అధిక రకాల మినుములను సంరక్షించారు. ఈ సదస్సులో పాల్గొనే వేదేశీ అతిథులకు ఫింగర్ మిలెట్ ని పిలిచే కుంద్రా బాటి మడియాను సాగు చేసే విధానం గురించి అవగాహన కల్పించనున్నారు. అదే విధంగా పర్యావరణ పరిరక్షణ, సుస్థిత సేద్యపు విధానాలు, ప్రకృతి ఎరువుల తయారీ విధానం, పంట మార్పిడి, వంటి సంప్రాయ పద్ధతులను అతిథులకు పరిచయం చేయనున్నారు. ఈ సదస్సులో పాల్గొనే అవకాశాన్ని కల్పించినందుకు మహిళలు కేంద్రానికి కృతజ్ఞతలు తెలిపారు.
tribal womens special speach at G20 summit
odisha, millet cultivation, tribal womens, special speach, G20 summit , Tribal woman farmer,Odisha Bhumia community, receives invitation, New Delhi,millets, millet production, finger millets , Odisha Millet Mission , Rushi Sunak,British Prime Minister, Akshata Murthy, US President Joe Biden, Prime Minister Modi, Narendra Modi, Russia-Ukraine, historic event, Foreign guests, pulses cultivation,
Raimati Ghuria , Subasa Mohanta , Mayurbhanj district , methods of environmental protection, sustainable farming practices, natural fertilizer manufacturing process, crop rotation, national news, latest news