Nusrat Jahan : బెంగాల్ హీరోయిన్, ఎంపీ నుస్రత్ జహాన్‌కు ఈడీ నోటీసులు
X
తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ, బెంగాలీ సినీ నటి నుస్రత్ జహాన్ చిక్కుల్లో పడ్డారు. పశ్చిమ బెంగాల్‌కు చెందిన బీజేపీ నేత ఫిర్యాదుతో.. ఈడీ ఆమెకు నోటీసులు జారీ చేసింది. తక్కువ ధరకే(రూ.5.5 లక్షలు) ఫ్లాట్లు విక్రయిస్తానని చెప్పి ప్రజలను మోసం చేశారని భారతీయ జనతా పార్టీ (బీజేపీ) నాయకుడు శంకుదేబ్ పాండా ఫిర్యాదు చేయడంతో ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ జహాన్‌పై కేసు నమోదు చేసింది.ప్టెంబర్ 12న కోల్‌కతాలోని ఎన్‌ఫోర్స్‌మెంట్ డైరెక్టరేట్ (ED) ఆఫీసు ముందు హాజరుకావాలని ఆదేశించింది. ప్రస్తుతం ఎంపీగా ఉన్న నుస్రత్ జహాన్ దాదాపు రూ. 24 కోట్ల మోసాలకు పాల్పడినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఈ ఆరోపణలను ఆమె ఖండించారు.
బీజేపీ నేత ఫిర్యాదు ప్రకారం, కోల్‌కతా శివార్లలో 1,000 చదరపు అడుగుల విస్తీర్ణంలో అపార్ట్‌మెంట్లు ఇస్తామని ఇండియన్ ఓవర్సీస్ బ్యాంక్‌లోని 429 మంది ఉద్యోగుల నుండి డబ్బు తీసుకున్న సెవెన్ సెన్స్ ఇంటర్నేషనల్ అనే రియల్ ఎస్టేట్ కంపెనీకి నుస్రత్ జహాన్ డైరెక్టర్‌గా ఉన్నారు. ఇప్పటివరకు తమకు ఫ్లాట్ గానీ, డబ్బులు గానీ తిరిగి రాలేదని సదరు బాధితుల తరఫున పాండా తన కంప్లైంట్ లో పేర్కొన్నాడు. అయితే ఆరోపణలను తోసిపుచ్చిన జహాన్, తాను 2017లో కంపెనీకి రాజీనామా చేసినట్లు గతంలో తెలిపింది. ఈడీ వర్గాల సమాచారం ప్రకారం, నుస్రత్ జహాన్‌తో పాటు కంపెనీ డైరెక్టర్ రాకేష్ సింగ్, మరో ఉన్నతాధికారి రూపేఖా మిత్రా కూడా సమన్లు పంపారు. జహాన్‌తో పాటు మరికొందరిపై ఇదే విషయంలో కోల్‌కతాలోని అలీపూర్ కోర్టులో ఒక కేసు కూడా దాఖలైంది. ఆమెకు వ్యతిరేకంగా సమన్లు కూడా జారీ చేయబడ్డాయి. కానీ ఆమె ఇంతవరకు కోర్టుకు హాజరు కాలేదు.
ప్లాట్లు ఇస్తానని ప్రకటించి.. ఐదేళ్లు పూర్తయినా ఇప్పటివరకు ఎలాంటి నిర్మాణాలు చేపట్టలేదని, దీంతో మోసపోయామని బాధితులు ఇప్పటికే పోలీసుల(Police)కు ఫిర్యాదు చేశారు. దీంతో ఆమెపై స్థానిక పోలీస్ స్టేషన్లో ఇది వరకే కేసులు కూడా ఉన్నాయి. ఈ నేపథ్యంలోనే భారతీయ జనతా పార్టీ నాయకుడు శంకు దేబ్ పాండా (Shanku Deb Panda) ఫిర్యాదు చేయడంతో ఈడీ ఆమెపై కేసు నమోదు చేసింది